CNG Cars: ఈవీలకు ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ కార్లు.. మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్న టాప్ కార్లు ఏంటంటే..?

|

Jun 28, 2024 | 4:45 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో కార్ల కొనుగోలు తారాస్థాయికు చేరింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు సొంతకారు కొనుగోలు చేయాలనే కలను నిజం చేసుకోవడానికి వాహన రుణాల సౌకర్యంతో సొంత కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కారు కొనుగోలు చేసినా దాని నిర్వహణ విషయంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

CNG Cars: ఈవీలకు ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ కార్లు.. మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్న టాప్ కార్లు ఏంటంటే..?
Nexon Cng
Follow us on

భారతదేశంలో ఇటీవల కాలంలో కార్ల కొనుగోలు తారాస్థాయికు చేరింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు సొంతకారు కొనుగోలు చేయాలనే కలను నిజం చేసుకోవడానికి వాహన రుణాల సౌకర్యంతో సొంత కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కారు కొనుగోలు చేసినా దాని నిర్వహణ విషయంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈవీ కార్లు పెద్దగా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవడం లేదు. కాబట్టి ఇటీవల కాలంలో సీఎన్‌జీ కార్ల కొనుగోళ్లకు అంతా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఉన్న కార్లను కూడా సీఎన్‌జీగా అప్‌గ్రేడ్ చేసుకునే సౌకర్యం ఉండడంతో చాలా మంది ఈ పని చేస్తున్నారు. అయితే ఈ కార్లు అధిక మైలేజ్‌ను ఇవ్వడంతో సీఎన్‌జీ సౌకర్యం ఉన్న కార్ల కొనుగోలుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోకి రానున్న  సీఎన్‌జీ కార్ల గురించి తెలుసుకుందాం. 

మారుతి సుజుకి స్విఫ్ట్ 

మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ మేక్‌కర్వ్‌తో వస్తుంది. కొత్త స్విఫ్ట్, 3-సిలిండర్ జెడ్ 12ఈ ఇంజన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సీఎన్‌జీ పర్యావరణ అనుకూలమైన, బడ్జెట్ ధరలకు డిమాండ్ ఉన భారతీయ మార్కెట్లో  లాంచ్ కానుంది. అయితే ఈ సీఎన్‌జీ కారు అధికారిక విడుదల తేదీనీ మారుతీ ధ్రువీకరించలేదు. అయితే ఈ వాహనం ఎప్పుడైనా పండుగ సీజన్ మార్కెట్లోకి వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ వేరియంట్ పై ఆధారపడి సాధారణ ధరలతో పోలిస్తే రూ.70,000 నుంచి 80,000 వరకు అధిక ధరతో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. 

మారుతి సుజుకి డిజైర్ 

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కూడా రాబోయే రోజుల్లో సీఎన్‌జీ ఎంపికతో అందుబాటులో ఉండనుంది. డిజైన్ మార్పులు స్విఫ్ట్ రిఫ్రెషన్‌ను ప్రతిబింబించే అవకాశం ఉంది. సరికొత్త టెయిలైట్లతో పునరుద్ధరించిన ఈ కారు నయా బూట్ డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారు  ఫీచర్ అప్డేడేట్లు కూడా స్విఫ్ట్ మాదిరిగానే ఉంటాయని అంచనా. ఈ కారు పండుగల సమయంలో అందుబాటులోకి రానుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

హ్యుందాయ్ డ్యూయల్ సిలిండర్ 

“హెచ్‌వై-సీఎన్‌జీ-డుయో” టెక్నాలజీ కోసం ట్రేడ్మార్క్ ఫైలింగ్‌తో హ్యుందాయ్ భారతదేశంలో తన సీఎన్‌జీను అందిస్తుంది. ఇది ప్రస్తుతం టాటా మోటార్స్‌కు సంబంధించిన సీఎన్‌జీ ఆఫర్లకు ప్రత్యేకమైన ట్విన్ సిలిండర్ సీఎన్‌జీ సిస్టమ్స్‌తో వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సాంకేతికత సింగిల్ సీఎన్‌జీ సిలిండర్‌ను బూట్ ఫ్లోర్ కింద ఉంచిన రెండు చిన్న వాటితో భర్తీ చేస్తుంది. ఇది విలువైన బూట్ స్పేస్‌ను ఖాళీ చేస్తుంది. హ్యుందాయ్ ప్రస్తుతం గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, ఎక్స్టర్లలో సీఎన్‌జీ ఎంపికలను అందిస్తోంది. ఇవి అన్నీ ఒకే CNG సిలిండర్తో 1.2-లీటర్ ఇంజన్ ఆధారంగా పని చేస్తుంది. అయితే హ్యూందాయ్ డ్యుయల్ సిలిండర్ కారును ఎప్పుడు రిలీజ్ చేస్తారో? అధికారికంగా పేర్కొనలేదు. 

టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ

టాటా నెక్సాన్ ఐసీఎమ్ఐ ఈ ఏడాది చివరలో విడుదల చేయనున్నట్లు టాటా మోటార్స్ ధ్రువీకరించింది. టర్బోచార్టర్ తో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌తో పనిచేసే భారతదేశంలో ఇది మొదటి ఎస్‌యూవీ అని నిపుణులు చెబుతున్నారు. నెక్సాన్ ఐసీఎన్‌జీ పవర్ ట్రెయిన్ కోసం కొన్ని మార్పులతో ప్రామాణిక నెక్సాన్ డిజైన్, ఫీచర్లతో వస్తుంది. ఈ సర్దుబాట్లలో సరైన పనితీరు కోసం సస్పెన్షన్ ట్వీక్లు, ఇతర నెక్సాన్ వేరియంట్ల నుంచి వేరు చేయడానికి “ఐసీఎన్‌జీ” బ్యాడ్జింగ్ ఉండవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి