AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కాటు..ఆర్ధిక మాంద్యంలోకి అడుగు పెట్టాం.. డేంజర్ బెల్ మోగించిన ఐఎంఎఫ్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా అప్పుడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనారంభించిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది.

కరోనా కాటు..ఆర్ధిక మాంద్యంలోకి అడుగు పెట్టాం.. డేంజర్ బెల్ మోగించిన ఐఎంఎఫ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 28, 2020 | 11:29 AM

Share

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా అప్పుడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనారంభించిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. దీని ఫలితంగా మనం ఆర్ధిక మాంద్యంలోకి అడుగు పెట్టామని, ఇది 2009 నాటికన్నా దారుణమైనదని ఈ సంస్థ చీఫ్ క్రిస్టలీనా జార్జియా పేర్కొన్నారు. గ్లోబల్ ఎకానమీ క్రమంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.. కనీసం 2.5 ట్రిలియన్ డాలర్లను సమీకరించగలిగితేనే మార్కెట్లు కోలుకోగలవని భావిస్తున్నాం అని ఆమె చెప్పారు. అయితే ఇది ఇంకా తక్కువ అంచనాయే అని పేర్కొన్నారు. ఇటీవలి వారాల్లో 8.3 బిలియన్ డాలర్లకు పైగా మూలధన పెట్టుబడి ఆవిరైపోయిందని, దేశీయ వనరుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఇప్పటికే పలు దేశాలు అప్పుల భారంతో కూరుకుపోయాయని క్రిస్టలీనా వెల్లడించారు. స్వల్పాదాయం గల 80 కి పైగా దేశాలు తమ సంస్థ నుంచి అత్యవసర సహాయాన్ని కోరినట్టు ఆమె చెప్పారు. ఆ దేశాల నగదు నిల్వలు ఎంతమేరకు ఉన్నాయో తమకు తెలియదని, అయితే ఈ సహాయాన్ని ఎంత త్వరగా వినియోగించుకుంటే అంత మంచిదని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికా సెనేట్ ఆమోదించిన 2.2 ట్రిలియన్ డాలర్ల ఎకనామిక్ ప్యాకేజీని ఆమె స్వాగతించారు. అమెరికా వంటి అగ్రరాజ్యం తన ఆర్ధిక కార్యకలాపాలను స్తంభింపజేయకుండా ఉండేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడుతుందన్నారు.