China: ఆ విషయంలో జర్మనీని వెనక్కినెట్టి టాప్‌ 10లోకి చైనా ఎంట్రీ! నంబర్‌ 1గా ఉన్న దేశం ఏందంటే..?

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) ర్యాంకింగ్ ప్రకారం, పెద్ద ఎత్తున పరిశోధన, అభివృద్ధి (R&D) పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా తొలిసారిగా టాప్ 10 ఇన్నోవేటివ్ దేశాల జాబితాలో చోటు సంపాదించింది. జర్మనీని అధిగమించి 10వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, అమెరికా, స్వీడన్ వంటి దేశాలు కూడా జాబితాలో ఉన్నాయి.

China: ఆ విషయంలో జర్మనీని వెనక్కినెట్టి టాప్‌ 10లోకి చైనా ఎంట్రీ! నంబర్‌ 1గా ఉన్న దేశం ఏందంటే..?
Germany And China

Updated on: Sep 16, 2025 | 7:25 PM

చైనాలోని పలు సంస్థలు రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌పై భారీగా పెట్టుబడులు పెట్టడంతో చైనా తొలిసారిగా ఐక్యరాజ్యసమితి మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ కంట్రీస్‌ యానువల్‌ ర్యాంకింగ్‌లో టాప్ 10లోకి ప్రవేశించింది. దీంతో యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని చైనా దాటేసింది. ఈ జాబితాలో 2011 నుండి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి, 78 సూచికల ఆధారంగా 139 ఆర్థిక వ్యవస్థలపై నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) సర్వేలో చైనా 10వ స్థానంలో నిలిచింది.

ప్రైవేట్ రంగ ఫైనాన్సింగ్‌లో అంతరాన్ని వేగంగా తగ్గించడంతో చైనా అతిపెద్ద ఆర్‌ అండ్‌ డీ వ్యయం చేసే దేశంగా అవతరించే దిశగా పయనిస్తున్నట్లు GII చూపించింది. అదే సమయంలో ప్రపంచ ఆవిష్కరణల దృక్పథం తగ్గుతున్న పెట్టుబడుల వల్ల మసకబారిందని సర్వే తెలిపింది. గత ఏడాది 2.9 శాతంగా ఉన్న పరిశోధన-అభివృద్ధి ఈ ఏడాది 2.3 శాతానికి తగ్గనుంది. ఇది ఆర్థిక సంక్షోభం తర్వాత 2010 తర్వాత అత్యల్ప స్థాయి. 2024లో అంతర్జాతీయ పేటెంట్ దరఖాస్తులలో చైనా దాదాపు నాలుగో వంతు వాటాను అందించింది. మొత్తం దరఖాస్తులలో 40 శాతం ఉన్న యునైటెడ్ స్టేట్స్, జపాన్, జర్మనీలు స్వల్ప క్షీణతను నమోదు చేశాయి.

పేటెంట్ల యాజమాన్యం ఒక దేశ ఆర్థిక బలం, పారిశ్రామిక పరిజ్ఞానానికి ముఖ్యమైన సంకేతంగా పరిగణిస్తారు. దీర్ఘకాలికంగా చూస్తే జర్మనీ 11వ స్థానానికి పడిపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని GII సహ-సంపాదకుడు సచా వున్ష్-విన్సెంట్ అన్నారు. కొత్త ర్యాంకింగ్‌లు అమెరికాలో ట్రంప్ పరిపాలన విధించిన సుంకాల ప్రభావాన్ని ప్రతిబింబించలేదని అన్నారు. పారిశ్రామిక ఆవిష్కరణలకు నిజంగా శక్తివంతమైన ఇంజిన్‌గా దశాబ్దాలుగా ఉన్న బలమైన హోదాతో పాటు, డిజిటల్ ఆవిష్కరణలకు శక్తి కేంద్రంగా ఎలా మారాలనేది జర్మనీ ముందున్న సవాలు అని WIPO డైరెక్టర్ జనరల్ డేరెన్ టాంగ్ అన్నారు. జాబితాలోని టాప్ 10 దేశాలలో – అమెరికా తర్వాత, చైనా కంటే ముందు దక్షిణ కొరియా, సింగపూర్, బ్రిటన్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ ఉన్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి