Indian Railways: ఆ రాష్ట్ర ప్రజలకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. 250 ప్రత్యేక రైళ్లు
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో..
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇక దీపావళి ముగింపుతో బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఛత్ పండుగ ప్రారంభమైంది. ఛత్ గొప్ప పండుగను జరుపుకోవడానికి దేశంలోని నలుమూలల నుండి ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వస్తారు. దీంతో రైలు, బస్సు, విమానాల్లో ఎక్కడికక్కడ టిక్కెట్ల కోసం బారులు తీరుతున్నారు. ఇలాంటి సమయంలో రైల్వే ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి పరిస్థితిలో భారతీయ రైల్వే ఛత్ కోసం 250 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా సమాచారం అందించారు. ఛత్ మహాపర్వ్ దృష్ట్యా మోడీ ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేసిందని చెప్పారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఎక్కువ మంది ప్రజలను ఇంటికి చేర్చేందుకు రైల్వే 250 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీంతో పాటు ఈ రైళ్ల ద్వారా 1.4 లక్షల మందికి బెర్తులు ఇస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల ప్రజలు దీపావళి పండుగను జరుపుకుని తిరిగి వస్తుండగా, బీహార్ ప్రజలు తమ ఇళ్లకు వెళ్లి పండుగ చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు చెప్పారు.
ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి భారతీయ రైల్వే మొత్తం 211 రైళ్లను ముందుగా ప్రారంభించినట్లు రైల్వే మంత్రి తెలిపారు. ఈ రైళ్లు మొత్తం 2,561 ట్రిప్పులు వేయనున్నాయి. ఇప్పుడు ఈ ప్రత్యేక రైళ్ల సంఖ్యను 250కి పెంచినట్లు ఆయన వెల్లడించారు. ఈ రైళ్లన్నీ మొత్తం 2,614 ట్రిప్పులు వేయనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు 36 లక్షలకు పైగా అదనపు బెర్త్‌లను అందించడానికి రైల్వే కృషి చేసిందని ఆయన చెప్పారు.
Total 36,59,000 extra berths made available for festival demand during Chhath, Diwali and Puja by running additional 2,614 trips of trains.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 26, 2022
బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లలో ఛత్ మహాపర్వ్ గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగను నాలుగు రోజుల పాటు నిర్వహించుకుంటారు. ఈ సంవత్సరం ఈ పండుగ 28 అక్టోబర్ 2022 నుండి ప్రారంభమై అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి