PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. 12వ విడత రాకపోవడానికి కారణమిదే.. డబ్బులు రావాలంటే ఇలా చేయండి..
లేటేస్ట్ అప్డేట్ ప్రకారం నవంబర్ 30న 12వ విడత నగదు రైతుల కాతాల్లో జమ చేయనుంది. ఆ సమయంలో మీరు భూమిలో నాట్లు వేయకపోతే.. సమీపంలోని వ్యవసాయ కేంద్రంలో సర్టిఫికేట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాలలో పీఎం కిసాన్ యోజన ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. దేశంలో సొంతంగా వ్యవసాయ భూమి కలిగిన అన్నదాతలకు ప్రతి ఏడాది రూ. 6000 వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. అయితే ఈ నగదు ఒకేసారి కాకుండా విడతల చొప్పున రైతులకు అందజేస్తుంది. ప్రతి నాలుగు నెలలకు రూ. 2000 చొప్పున ఏడాదికి మూడు విడతలుగా చెల్లిస్తారు. ఇప్పటివరకు 11 విడతలుగా నగదు రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. ఇక ఇప్పుడు 12వ విడత నగదు రిలీజ్ చేయనుంది. అయితే ప్రభుత్వం మార్చిన రూల్స్ కారణంగా పలువురు అన్నదాతలకు ఈ డబ్బు రావడం కష్టమే. ఈ పథకంలో ఏర్పడిన అవకతవకలను నిరోధించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే రైతులు పన్నెండవ విడత నగదు అందుకోవాలనుంటే కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అవెంటో తెలుసుకుందామా.
లేటేస్ట్ అప్డేట్ ప్రకారం నవంబర్ 30న 12వ విడత నగదు రైతుల కాతాల్లో జమ చేయనుంది. ఆ సమయంలో మీరు భూమిలో నాట్లు వేయకపోతే.. సమీపంలోని వ్యవసాయ కేంద్రంలో సర్టిఫికేట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
ల్యాండ్ సీడింగ్ జరిగిందా లేదా అని ఎలా తనిఖీ చేయాలి ?..
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి. ఆ తర్వాత లబ్దిదారులు స్థితి (లబ్దిదారుల స్టేటస్)పై క్లిక్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్ పై మీ స్టేటస్ కనిపిస్తుంది. మీ తండ్రి పేరు, రాష్ట్రం, మొబైల్ నంబర్, గ్రామం మొదలైన వివరాలు ఉంటాయి. అ తర్వాత మీరు e-KYC అప్డేట్ చెక్ చేస్తారు. అదే సమయంలో ల్యాండ్ సీడింగ్ కూడా చూస్తారు. ల్యాండ్ సీడింగ్ సక్సెస్ అయితే రైతుల ఖాతాల్లోకి నగదు చేస్తారు. ఒకవేళ ల్యాండ్ సీడింగ్ నో అని రాసి ఉంటే.. వెంటనే వ్యవసా కేంద్రానికి వెల్లి మీ పత్రాలను అప్డేట్ చేసుకోవాలి.