RBI అక్టోబర్ నెల బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను విడుదల చేసింది. ఇందులో వారాంతాలు (శనివారాలు, ఆదివారాలు) కూడా ఉంటాయి. ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. రాబోయే నెలలో మొత్తం 15 రోజులకు పైగా సెలవులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. దసరా నేపథ్యంలో అక్టోబర్ చివరి వారంలో ఎక్కువ బ్యాంకు సెలవులు ఉండటం కారణంగా.. బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకింగ్ పనుల కోసం వెళ్లేవారు.. సెలవుల లిస్ట్‌ను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే తమ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు.
అక్టోబర్‌లో బ్యాంక్ సెలవుల జాబితా ఇలా ఉంది..
2023 అక్టోబర్ 2:- సోమవారం, మహాత్మా గాంధీ జయంతి.
2023 అక్టోబర్ 14:- రెండో శనివారం. దేశంలోని అన్ని బ్యాంక్‌లకు సెలవు.
2023 అక్టోబర్ 15:- ఆదివారం. అన్ని బ్యాంక్‌లకు సెలవు.
2023 అక్టోబర్ 18:- బుధవారం, కాతి బిహు. అసోంలోని బ్యాంక్‌లకు సెలవు.
2023 అక్టోబర్ 19:- గురువారం, సంవత్సరి పండుగ. గుజరాత్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
2023 అక్టోబర్ 21:- శనివారం, దుర్గాపూజ.
2023 అక్టోబర్ 22:- ఆదివారం.
2023 అక్టోబర్ 23:- సోమవారం, మహా నవమి.
2023 అక్టోబర్ 24:- మంగళవారం దసరా.
2023 అక్టోబర్ 25:- దుర్గా పూజ
2023 అక్టోబర్ 26:- యాక్సెషన్ డే. జమ్ముకశ్మీర్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
2023 అక్టోబర్ 27:- దసై, దుర్గా పూజ.
2023 అక్టోబర్ 28:- నాలుగో శనివారం, లక్ష్మీ పూజ.
2023 అక్టోబర్ 29:- ఆదివారం.
2023 అక్టోబర్ 31:- మంగళవారం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి.
అక్టోబర్ నెలాఖరులో బ్యాంక్‌లకు దాదాపు అన్ని సెలవులే ఉన్నట్టు కనిపిస్తోంది! దీన్ని బట్టి మీరు మీ మీ పనులను ప్లాన్ ప్రకారం పూర్తి చేసుకోండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఇకపోతే, బ్యాంక్ సేవలు మూసి వేసినప్పటికీ, ఆన్‌లైన్ సేవలు అందుబాటులోనే ఉంటాయి. మీరు మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం సేవలను పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే.. బ్యాంక్ హాలీడేస్ తో డిజిటల్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదు. వీటితో మీరు హాయిగా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. నగదు బదిలీ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా డబ్బు విత్‌డ్రాలు చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. కానీ, కొన్ని రకాల బ్యాంక్ సేవలకు మాత్రం అంతరాయం తప్పదు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..