
మీరు సెలవులు లేదంటే బిజినెస్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే, చౌక ధరలకు విమాన ప్రయాణం చేసే అవకాశం లభిస్తోంది. భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వారం రోజుల పాటు ‘గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్’ సేల్‌ను ప్రకటించింది. కంపెనీ సేల్ సెప్టెంబర్ 15 నుండి 21 వరకు జరుగుతుంది. ఈ సేల్ 2026 ప్రారంభంలో కస్టమర్లు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లు జనవరి 7 నుండి మార్చి 31, 2026 వరకు ప్రయాణానికి చెల్లుతాయి. మరింకేం..సంక్రాంతి సెలవులు, పండుగలు లేదా వ్యాపార పనుల కోసం ముందుగానే టూర్ ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి అవకాశం అంటున్నారు నిపుణులు.
విమాన టిక్కెట్ ధరలు రూ.1,299 నుండి ప్రారంభమవుతాయి: ‘ గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్ ‘ కింద వినియోగదారులు రూ.1,299 నుండి ప్రారంభమయ్యే వన్-వే దేశీయ ఛార్జీలను, రూ.4,599 నుండి ప్రారంభమయ్యే అంతర్జాతీయ ఛార్జీలను ఆస్వాదించవచ్చు. ఈ ఆఫర్ ఇండిగో వన్-వే బుకింగ్‌లకు మాత్రమే చెల్లుతుంది. రౌండ్-ట్రిప్ బుకింగ్‌లకు వర్తించదు. అలాగే, ఈ ఆఫర్ ఇండిగో నిర్వహించే నాన్-స్టాప్ విమానాలకు మాత్రమే చెల్లుతుంది.
ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో స్ట్రెచ్/బిజినెస్ క్లాస్‌కు అన్నీ కలిసిన (వన్-వే) ఛార్జీలు రూ. 9,999 నుండి ప్రారంభమవుతాయి.
బ్లూచిప్ సభ్యులకు ఆఫర్: ఇండిగో ప్లాట్‌ఫామ్ ద్వారా బుక్ చేసుకునే వారికి బ్లూచిప్ సభ్యులకు 10శాతం వరకు అదనపు తగ్గింపులు, లగేజీ, భోజనం, సీటు ఎంపిక వంటి ఆకర్షణీయమైన ఆఫర్‌లతో సహా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
బుక్ చేసుకోవడం ఎలా?: ఇండిగో వెబ్‌సైట్ ( www.goindigo.in ), మొబైల్ యాప్, AI- పవర్డ్ అసిస్టెంట్ 6Eskai లేదా ఇండిగో వాట్సాప్ +91 70651 45858 ద్వారా బుకింగ్‌లను సులభంగా చేసుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..