CIBIL Score: మెరుగైన సిబిల్ స్కోర్‌తో చౌకైన గృహ రుణాలు.. ఏ బ్యాంకు ఇస్తుందో తెలుసా?

|

May 24, 2023 | 4:30 PM

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచినప్పటికీ మెరుగైన సిబిల్ స్కోర్ ఉంటే వారికి తక్కువ ధరలకే రుణాలను అందిస్తుంది. సిబిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తికు సంబంధించిన క్రెడిట్ స్కోర్. ఇది వ్యక్తి చెందిన ఆర్థిక క్రమశిక్షణను 300-900 మధ్య స్కేల్ చేస్తుంది.

CIBIL Score: మెరుగైన సిబిల్ స్కోర్‌తో చౌకైన గృహ రుణాలు.. ఏ బ్యాంకు ఇస్తుందో తెలుసా?
CIBIL Score
Follow us on

రెపో రేటు విషయంలో ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై భారీ వడ్డీని ప్రకటించాయి. దీంతో ఎక్కువ మంది పెట్టుబడిదారులు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వైపు మొగ్గుచూపారు. అయితే అన్ని బ్యాంకులు తీసుకున్న చర్యల వల్ల కచ్చితంగా పర్సనల్, హోమ్ వంటి ఈఎంఐలపై వడ్డీ భారాన్ని పెంచుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. వారి అంచనాలకు తగినట్లే అన్ని బ్యాంకులు మొదటగా గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. అయితే దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచినప్పటికీ మెరుగైన సిబిల్ స్కోర్ ఉంటే వారికి తక్కువ ధరలకే రుణాలను అందిస్తుంది. సిబిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తికు సంబంధించిన క్రెడిట్ స్కోర్. ఇది వ్యక్తి చెందిన ఆర్థిక క్రమశిక్షణను 300-900 మధ్య స్కేల్ చేస్తుంది. అయితే ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే మంచిగా పరిగణిస్తారు. ఇలాంటి సమయంలో రుణ ఆమోదం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

సిబిల్ స్కోర్ అనేది మనం గతంలో ఏదైనా రుణం తీసుకుని దాన్ని ఏ విధంగా చెల్లించామో? వంటి వివరాలను అందిస్తుంది. మనం తిరిగి చెల్లించే సమయంలో డిఫాల్ట్‌గా మారితే దాని ప్రభావం మన సిబిల్ స్కోర్‌పై పడుతుంది. సిబిల్ స్కోర్ రుణగ్రహీతలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలను పొందడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, గృహ రుణాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణ రేట్లను అందిస్తుంది. ఇది 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి 9.15 శాతం, 700-749 స్కోర్ ఉన్నవారికి 9.35 శాతం, 650-699 సిబిల్ స్కోర్ ఉన్నవారికి 9.45 శాతం చొప్పున సాధారణ గృహ రుణాన్ని అందిస్తుంది. సిబిల్ స్కోర్ 550-649 ఉన్నవారు 9.65 శాతం వద్ద గృహ రుణాన్ని పొందవచ్చు. కాబట్టి మన సిబిల్ స్కోర్‌ను ఎలా తెలుసుకోవచ్చో? ఓ సారి చూద్దాం. సిబిల్ స్కోర్‌ను ఎలాంటి ఛార్జీ లేకుండా సంవత్సరానికి ఒక నివేదికను తెలుసుకోవచ్చు. సిబిల్ స్కోర్ అనేది ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు. మీరు సిబిల్ స్కోర్‌ని తనిఖీ చేయడానికి క్రింది దశలు ఉన్నాయి:

  • అధికారిక సిబిల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి
  • మీ సిబిల్ స్కోర్ పొందండి అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • మీ ఉచిత వార్షిక సిబిల్ స్కోర్‌ను పొందడానికి ‘ఇక్కడ క్లిక్ చేయండి’పై క్లిక్ చేయాలి.
  • మీ పేరు, ఇ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి. ఐడీరుజువు (పాస్‌పోర్ట్ నంబర్, పాన్ కార్డ్, ఆధార్ లేదా ఓటర్ ఐడీ) జత చేయండి. ఆపై మీ పిన్ కోడ్, పుట్టిన తేదీ, మీ ఫోన్ నంబర్‌ను కూడా నమోదు చేయాలి
  • తర్వాత ‘అంగీకరించి కొనసాగించు’పై క్లిక్ చేయాలి.
  • మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) పొందుతారు. ఓటీపీని టైప్ చేసి, ‘కొనసాగించు’ ఎంచుకోవాలి.
  • ‘గో టు డాష్‌బోర్డ్’ ఎంచుకుని, మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయండిస
  • అనంతరం మీరు ఇతర అనే వెబ్‌సైట్‌కు వెళ్తారు.
  • అక్కడ సభ్యుని లాగిన్‌పై క్లిక్ చేసి, మీరు లాగిన్ అయిన తర్వాత, మీరు మీ సిబిల్ స్కోర్‌ను చూడవచ్చు.

అంతే కాకుండా పేటీఎం, జీపే, క్రెడ్ వంటి వివిధ ఆర్థిక ప్లాట్‌ఫారమ్‌లు కూడా వినియోగదారులకు వారి క్రెడిట్ స్కోర్‌లను తనిఖీ చేయడానికి ఒక ఎంపికను అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్నిబిజినెస్ వార్తల కోసం చూడండి..