AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Address Change: ఆధార్‌తో పాన్ కార్డులోని అడ్రస్ సింపుల్‌గా మార్చేయండి.. ఈ టిప్స్ ఫాలో అయితే సరి..

పాన్ కార్డులు చాలా మంది ఇది వరకే తీసుకుని ఉంటారు. కార్డు తీసుకున్న సమయంలో అడ్రస్ తర్వాత అడ్రస్ వేరుగా ఉంటుంది. అయితే కార్డు మీద అడ్రస్ ఉండదు అనే ఉద్దేశంతో చాలా మంది పాన్ కార్డులో అడ్రస్‌లు అప్‌డేట్ చేయరు. అయితే ఆదాయపు పన్ను శాఖ మాత్రం పాన్ ఖాతాదారులు ఎప్పటికప్పుడు తమ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచనలు ఇస్తూ ఉంటారు.

PAN Address Change: ఆధార్‌తో పాన్ కార్డులోని అడ్రస్ సింపుల్‌గా మార్చేయండి.. ఈ టిప్స్ ఫాలో అయితే సరి..
PAN-Aadhaar Link
Nikhil
|

Updated on: Jun 12, 2023 | 4:15 PM

Share

పాన్ అనేది ఆదాయపు పన్ను (ఐటీ) డిపార్ట్‌మెంట్ ద్వారా జారీ చేయబడిన ఒక ప్రత్యేకమైన పది-అక్షరాల అల్ఫాన్యూమరిక్ గుర్తింపు కార్డు సంఖ్య. ప్రస్తుతం ప్రతి బ్యాంకింగ్ అవసరాలకు పాన్ అనేది తప్పనిసరి  ప్రతంగా పేర్కొంటున్నారు. అయితే పాన్ కార్డులు చాలా మంది ఇది వరకే తీసుకుని ఉంటారు. కార్డు తీసుకున్న సమయంలో అడ్రస్ తర్వాత అడ్రస్ వేరుగా ఉంటుంది. అయితే కార్డు మీద అడ్రస్ ఉండదు అనే ఉద్దేశంతో చాలా మంది పాన్ కార్డులో అడ్రస్‌లు అప్‌డేట్ చేయరు. అయితే ఆదాయపు పన్ను శాఖ మాత్రం పాన్ ఖాతాదారులు ఎప్పటికప్పుడు తమ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచనలు ఇస్తూ ఉంటారు. అయితే భారత ప్రభుత్వం జారీ చేస్తున్న ఆధార్ ద్వారా కూడా పాన్ కార్డులో అడ్రస్ మార్చుకునే వెసులుబాటు కూడా అందుబాటులోకి వచ్చింది.

ఆధార్ అంటే 12 అంకెల యూనిక్యూ ఐడీ. దీన్ని యూఐడీఏఐ జారీ చేస్తుంది. ముఖ్యంగా ఈ ఆధార్ తీసుకునే సమయంలో పౌరుల బయోమెట్రిక్‌తో డెమోగ్రాఫిక్ డేటాను నిక్షిప్తం చేస్తుంది.సుప్రీం కోర్టు ఆధార్ వినియోగాన్ని స్వచ్ఛందంగా చేసినా వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి అని పరిగణిస్తున్నారు. ఆధార్‌ను ఉపయోగించి వివిధ సేవలను కోసం సులభంగా నమోదు చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం కూడా ఆధార్ పాన్ కార్డు లింక్ కూడా తప్పనిసరి చేసింది. ఇప్పటికే చాలా మంది ఆధార్‌తో పాన్‌ను అనుసంధానించుకోగా మరికొంత మంది వారి డేటాలో తప్పుల కారణంగా అనుసంధానించుకోవడానికి ఇబ్బంది పడుతన్నారు. అలాగే మీరు ఇటీవల కొత్త చిరునామాకు మారినా పాన్ కార్డులో కూడా నివాస చిరునామాను మార్చాలనుకుంటే మీ మొబైల్ నంబర్‌కి లింక్ చేసిన మీ ఆధార్ కార్డ్ సహాయంతో మీరు మీ పాన్‌లోని చిరునామా వివరాలను మార్చుకోవచ్చు.  చాలా సింపుల్‌గా ఇంట్లో నుంచి కదలకుండా ఆన్‌లైన్ ప్రాసెస్‌ ద్వారా ఆధార్ కార్డు ద్వారా పాన్ అడ్రస్ మార్చుకోవచ్చు. ఆ సింపుల్ స్టెప్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఆధార్ ద్వారా పాన్ అడ్రస్ మార్చుకోండిలా

  • యూటీఐఐటీఎస్ఎల్ పోర్టల్‌ని సందర్శించాలి.
  • అక్క పాన్ కార్డ్‌లో మార్పు/కరెక్షన్‌పై క్లిక్ చేసి, పాన్ కార్డ్ వివరాలలో మార్పు/కరెక్షన్ కోసం దరఖాస్తు టిక్ చేసి నెక్స్ట్ నొక్కండి.
  • తదుపరి పేజీలో మీ పాన్ నంబర్‌ను నమోదు చేసి, పాన్ చిరునామాను అప్‌డేట్ చేయడానికి యూఐడీఏఐ డేటాబేస్ నుండి పొందిన వివరాలను ఉపయోగించడానికి ఆధార్ బేస్ ఈ-కెవైసి చిరునామా నవీకరణను తనిఖీ చేయండి.
  • ఆధార్ నంబర్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ మొదలైన అన్ని అవసరమైన వివరాలను నమోదు చేసి సబ్మిట్‌పై నొక్కండి
  • ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్. ఇమెయిల్ చిరునామాకు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) పంపిస్తారు.
  • అక్కడ ఓటీపీని నమోదు చేసి సమర్పించుపై క్లిక్ చేయండి.
  • మీరు మీ ఆధార్ కార్డ్‌లోని వివరాలను ఉపయోగించి మీ నివాస చిరునామాను విజయవంతంగా మార్చారని మెసేజ్ చూపుతుంది.
  • చిరునామా నవీకరణ విజయవంతమైతే మీరు మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌కు ఈమెయిల్, ఎస్ఎంఎస్‌ను అందుకుంటారు.

మరిన్ని  బిజినెస్ న్యూస్ కోసం