Upcoming Hero Bikes: హీరో నుంచి కొత్త బైక్‌ల జాతర.. ఎక్స్‌ట్రీమ్ నుంచి కరిజ్మా వరకూ.. పూర్తి వివరాలు ఇవి..
ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ హీరో నుంచి కొత్త బైక్ లు ఈ ఏడాది క్యూ కట్టనున్నాయి. కొత్త ఆవిష్కరణతో పాటు పలు డిమాండ్ ఉన్న పాత మోడళ్ల ను కూడా అప్ గ్రేడ్ చేసి మార్కెట్లో రీ లాంచ్ చేసేందుకు హీరో మోటోకార్ప్ సన్నాహాలు చేస్తోంది.
ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ హీరో నుంచి కొత్త బైక్ లు ఈ ఏడాది క్యూ కట్టనున్నాయి. కొత్త ఆవిష్కరణతో పాటు పలు డిమాండ్ ఉన్న పాత మోడళ్ల ను కూడా అప్ గ్రేడ్ చేసి మార్కెట్లో రీ లాంచ్ చేసేందుకు హీరో మోటోకార్ప్ సన్నాహాలు చేస్తోంది. వాటిల్లో ఎక్స్ ట్రీమ్ 200ఎస్ 4వీ, కొత్త ఎక్స్ ట్రీమ్ 160ఆర్, కరిజ్మా ఎక్స్ఎంఆర్ అప్ గ్రేడెడ్ వెర్షన్లో వస్తుండగా.. రెండు 400సీసీ మోటార్ సైకిళ్లు కొత్తగా లాంచ్ కానున్నాయి. జూన్ 14న కొత్తగా అప్ గ్రేడ్ అయిన ఎక్స్ ట్రీమ్ 160ఆర్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అలాగే ఎక్స్ ట్రీమ్ 200ఎస్ బైక్ ఇప్పటికే డీలర్ల వద్దకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో హీరోమోటో కార్ప్ నుంచి వస్తున్న కొత్త బైక్ ల గురించి ఓ సారి చూద్దాం..
హీరో నుంచి వస్తున్న 400సీసీ బైక్స్ ఇవే..
హీరో కంపెనీ నుంచి సరికొత్త స్పోర్ట్స్ మోడల్ బైక్స్ రానున్నాయి. వాటిల్లో ఒకటి 421సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో ఇవి వస్తోంది. హ్యాండిల్ బార్స్ పైన క్లిప్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉంటాయి. డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ డ్యాష్ బోర్డ్, డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్ వంటి అధునాతన ఫీచర్లు ఈ బైక్ లో ఉంటాయి. అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందో మాత్రం కంపెనీ ప్రకటించలేదు. అలాగే ఎక్స్ పల్స్ 400 అడ్వెంచర్ బైక్ కూడా హీరో మోటో కార్ప్ టెస్టింగ్ చేస్తోంది. దీనిలో కూడా 421సీసీ ఇంజిన్ ఉంటుంది. 40 హార్స్ పవర్, 35ఎన్ఎం టార్క్ ని ఈ ఇంజిన్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని 2023 చివరిలో గానీ, లేక 2024 మొదటి నెలల్లో గానీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
సరికొత్తగా హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్..
కరిజ్మా ఎక్స్ఎంఆర్ బ్రాండ్ నేమ్ అందరికీ తెలిసిందే. అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఇది. దీనిని ఇప్పుడు హీరో కంపెనీ అప్ గ్రేడ్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ప్రోడక్షన్ వెర్షన్ ని డీలర్ షిప్స్ వద్ద కంపెనీ డిస్ ప్లే చేసింది. షార్ప్ ఫ్రంట్ ఫేసియా, అగ్రెసివ్ ఫైయిరింగ్, స్లీక్ టైల్ సెక్షన్, రైస్డ్ హ్యాండిల్ బార్ ఉంటుంది. దీనిలో 210సీసీ లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉంటుంది. 25 హార్స్ పవర్స్, 30ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఆరు గేర్లు ఉంటాయి. దీనిని కూడా తర్వలోనే లాంచ్ చేసే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..