Mega Textile Parks: 7 టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్.. ఏఏ రాష్ట్రాలు ఇంట్రెస్టింగ్‎గా ఉన్నాయంటే..

|

Oct 25, 2021 | 6:57 AM

2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించినట్లుగా ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరల్ (PM MITRA) పార్కుల ఏర్పాటు కోసం టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడంతోపాటు గ్లోబల్ టెక్స్‌టైల్స్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు...

Mega Textile Parks: 7 టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్.. ఏఏ రాష్ట్రాలు ఇంట్రెస్టింగ్‎గా ఉన్నాయంటే..
Textile
Follow us on

2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించినట్లుగా ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరల్ (PM MITRA) పార్కుల ఏర్పాటు కోసం టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడంతోపాటు గ్లోబల్ టెక్స్‌టైల్స్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.4,445 కోట్ల కేటాయింపులతో ఈ స్కీమ్‌ అమలు చేయనున్నారు. ఇది ఈ ఇంటిగ్రేటెడ్ విజన్ ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం మరింత వృద్ధి చెందడానికి సహాయపడుతుందని తెలిపింది. ఒక్కొక్క పార్కు ద్వారా లక్ష ప్రత్యక్ష, రెండు లక్షల పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పార్కులు ఏర్పాటుకు ముందుకు వస్తున్న రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

ఈ పథకం భారతదేశానికి పెట్టుబడులను ఆకర్షించడంలో, ఉపాధి కల్పనను పెంచడంలో ప్రపంచ టెక్స్‌టైల్ మార్కెట్‌లో బలంగా నిలదొక్కుకోవడంలో సహాయపడుతుందని పేర్కొంది. 1,000 ఎకరాలకుపైగా అందుబాటులో ఉన్న భూమి, టెక్స్‌టైల్స్‌కు సంబంధించి ఇతర సౌలభ్యత, తగిన పర్యావరణ వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని పార్కుల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించడం జరుగుతోందని తెలిపింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, ఒడిస్సా, గుజరాత్, రాజస్తాన్, అస్సోం, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ పార్కుల ఏర్పాటుకు తమ ఉత్సుకతను తెలియజేసినట్లు కూడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. టెక్స్‌టైల్స్ తయారీ యూనిట్ల స్థాపన కోసం ప్రతి పార్కుకు 300 కోట్ల రూపాయల ప్రోత్సాహకం అందించనున్నారు. ఈ పథకం భారతీయ కంపెనీలు ప్రంపచ కంపెనీలుగా ఎదుగెందుకు సహాయపడుతుంది కేంద్రం తెలిపింది. పథకం కోసం వివరణాత్మక మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయని పేర్కొంది.

Read Also.. Gold Price Today: పండగ సీజన్‌లో బంగారం ధర అదే జోరు.. మహిళలకు షాకిస్తున్న ధరలు..!