కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకుని వచ్చి అమలుచేస్తోంది. దీనిలో భాగంగా 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించి రైతులకు చేయూతనందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున.. మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12 వాయిదాల నగదును రైతులకు అందించగా.. ఇప్పుడు 13వ విడత పీఎం కిసాన్ నగదు కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమవుతోందని పేర్కొంటున్నారు. పీఎం కిసాన్ నగదు 6000 వేల నుంచి మరింత పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ నగదును పెంచే యోచనలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. వివిధ మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం PM-KISAN పథకం కింద రైతులకు అందిస్తున్న వార్షిక ఆర్థిక ప్రయోజనాన్ని రూ. 8,000కి పెంచే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. 8వేలను అర్హులైన రైతుల ఖాతాలో 4 సమాన వాయిదాలలో పంపిణీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీమ్ ను 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయుతనందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించి, నేరుగా రూ.6వేలను రైతుల ఖాతాల్లో జమచేస్తోంది.
భూమిని కలిగి ఉన్న రైతుల కుటుంబాలు, వారి పేర్లపై సాగు చేయదగిన భూమి ఉన్నవారు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..