పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం మరో కీలక ప్రకటన.. ప్రతీ 15 రోజులకు..

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రతీ 15 రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తామని తెలిపింది. ఆయిల్ కంపెనీలకు నష్టాలను పూడ్చేందుకే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినట్ల ప్రకటించింది. డీజిల్ ఎగుమతులపై అదనపు సుంకం విధించినట్లు స్పష్టం చేసింది.

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం మరో కీలక ప్రకటన.. ప్రతీ 15 రోజులకు..
Petrol, Diesel Prices

Updated on: Mar 27, 2026 | 8:57 PM

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వీటి ధరలను 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సెంటర్ల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఛైర్మన్ వివేక్ చతుర్దేతి తెలిపారు. ఇక డీజిల్, ఎటీఎఫ్‌లపై అదనపు సుంకాలను విధించామని, దీని వల్ల 15 రోజుల్లో ప్రభుత్వానికి రూ.1500 కోట్ల ఆదాయం లభిస్తుందన్నారు. దేశంలో వాటిని అందుబాటులోకి ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందన్నారు. 15 రోజుల్లో దాదాపు రూ.7 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వం కోల్పోతుందని వెల్లడించారు.

వాటిపై సుంకం పెంపు

దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందనే క్రమంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ఎక్సైజ్ సంకాన్ని భారీగా తగ్గించింది. ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్‌పై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 మేర తగ్గించింది. వీటి వల్ల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనప్పటికీ.. ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. యుద్ద పరిస్థితుల క్రమంలో ఇంధన రవాణాకు అంతరాయం కలగడంతో పాటు ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని వల్ల ఆయిల్ కంపెనీలు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో కంపెనీలకు నష్టాలను తగ్గించేందుకు కేంద్రం సుంకాలను తగ్గించింది. డీజిల్‌పై సుంకాన్ని సున్నాకు పరిమితం చేసింది. ఇక ఎగుమతులను అరిట్టేందుకకు డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ప్యూయెల్‌పై సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మోదీ కీలక సమావేశం

అటు ఇంధన నిల్వలపై చర్చించేందుకు శుక్రవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారంపై చర్చించారు. కొరత రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలో పుష్కలంగా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని సూచించారు.

Follow Us