Pension Withdraw: పీఎఫ్‌ పెన్షనర్లకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. ఇక ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌ విత్‌డ్రా

|

Sep 05, 2024 | 6:15 PM

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య ఎక్కువ. వారి రిటైర్‌మెంట్‌ తర్వాత గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు వీలుగా ఎంప్లాయ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎప్‌)లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. అలాగే ఉద్యోగుల పెట్టుబడి ఆధారంగా రిటైరయ్యాక ప్రతి నెలా ఈపీఎఫ్‌ఓ పింఛన్‌ అందిస్తుంది. అయితే తాజాగా ఈపీఎఫ్‌ పింఛన్‌దారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

Pension Withdraw: పీఎఫ్‌ పెన్షనర్లకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. ఇక ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌ విత్‌డ్రా
Epfo
Follow us on

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య ఎక్కువ. వారి రిటైర్‌మెంట్‌ తర్వాత గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు వీలుగా ఎంప్లాయ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎప్‌)లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. అలాగే ఉద్యోగుల పెట్టుబడి ఆధారంగా రిటైరయ్యాక ప్రతి నెలా ఈపీఎఫ్‌ఓ పింఛన్‌ అందిస్తుంది. అయితే తాజాగా ఈపీఎఫ్‌ పింఛన్‌దారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక ఏ బ్యాంకు బ్రాంచ్‌ నుంచైనా పింఛన్‌ విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.  జనవరి 2025 నుంచి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పెన్షన్ స్కీమ్‌లో నమోదు చేసుకున్న పింఛనుదారులు తమ నిధులను దేశవ్యాప్తంగా ఏదైనా బ్యాంక్ లేదా బ్రాంచ్ నుంచి యాక్సెస్ చేయగలరని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ ఉద్యోగుల కోసం తీసుకున్న తాజా నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈపీఎఫ్ పింఛనుదారులు తమ ఖాతా ఉన్న నిర్దిష్ట బ్యాంక్ లేదా బ్రాంచ్‌ని తప్పనిసరిగా సందర్శించి పెన్షన్ విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశానికి అధ్యక్షత వహించిన మాండవియా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) 1995 కోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (సీపీపీఎస్)ని ప్రవేశపెట్టే విధానాన్ని ఆమోదించారని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కొత్త విధానం దేశంలోని ఏదైనా బ్యాంకు శాఖ ద్వారా అయినా పెన్షన్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. పీఎఫ్‌వోను ఆధునీకరించే దిశగా సీపీపీఎస్ ఆమోదం ఒక ముఖ్యమైన దశ అని నిపుణులు చెబుతున్నారు. సీపీపీఎస్ ఆమోదం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఒక ప్రధాన మైలురాయి అని పేర్కొంటున్నారు. ఈ వ్యవస్థ పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తుంది. ముఖ్యంగా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా ఉంటుంది.  దాదాపు 78 లక్షల మంది ఈపీఎస్-95 పెన్షనర్లు కొత్త కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ నుంచి ప్రయోజనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. 

పదవీ విరమణ తర్వాత వారి స్వగ్రామాలకు వెళ్లే పెన్షనర్లకు ప్రభుత్వ చర్యలు ఉపశమనం కలిగిస్తాయి. ఈపీఎఫ్ఓ ఐటీ ఆధునికీకరణ ప్రాజెక్ట్ సెంట్రలైజ్డ్ ఐటీ ఎక్విప్డ్ సిస్టమ్‌లో భాగమైన కొత్త సౌకర్యం 1 జనవరి 2025న ప్రారంభిస్తారు. తదుపరి దశలో సీపీపీఎస్ సజావుగా ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్)కి మారుతుంది. ప్రస్తుత విధానంలో ప్రతి ఈపీఎఫ్ఓ ​​ప్రాంతీయ కార్యాలయం కేవలం మూడు లేదా నాలుగు బ్యాంకులతో ప్రత్యేక ఒప్పందాలను ఏర్పరచుకోవాలి. కొత్త విధానంతో పెన్షనర్లు తమ పెన్షన్ ప్రారంభమైనప్పుడు ధ్రువీకరణ కోసం బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేదని, చెల్లింపులు విడుదలైన వెంటనే జమ అవుతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..