EV Subsidies: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం నయా పాలసీ.. కొనుగోలుదారులకు లాభమేనా..?

|

Sep 13, 2024 | 4:00 PM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పై పలు రాయితీలను అందిస్తున్నారు.  ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి సహాయక పర్యావరణ వ్యవస్థ మెరుగుపర్చేందుకు పీఎం ఈ ఎలక్ట్రిక్ డ్రైవ్ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా భారతదేశంలో అందుబాటులో ఉన్న ఫేమ్ స్కీమ్ గడువు ఈ ఏడాది మార్చితో ముగిసింది. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులతో పాటు ఎలక్ట్రిక్ అంబులెన్స్‌ల కొనుగోలుపై రాయితీలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలకు మొత్తం 10,900 కోట్లను కేటాయించింది.

EV Subsidies: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం నయా పాలసీ.. కొనుగోలుదారులకు లాభమేనా..?
Ev Subsidies
Follow us on

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పై పలు రాయితీలను అందిస్తున్నారు.  ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి సహాయక పర్యావరణ వ్యవస్థ మెరుగుపర్చేందుకు పీఎం ఈ ఎలక్ట్రిక్ డ్రైవ్ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా భారతదేశంలో అందుబాటులో ఉన్న ఫేమ్ స్కీమ్ గడువు ఈ ఏడాది మార్చితో ముగిసింది. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులతో పాటు ఎలక్ట్రిక్ అంబులెన్స్‌ల కొనుగోలుపై రాయితీలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలకు మొత్తం 10,900 కోట్లను కేటాయించింది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ- బస్ సేవా-చెల్లింపు భద్రతా మెకానిజం పథకాన్ని కూడా ప్రవేశ పెట్టింది. ఇది 33,435 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ వ్యయంతో 2028-29 వరకు భారతదేశం అంతటా 38,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులను విడుదల చేయాలనే లక్ష్యంతో ఉంది. కొత్తగా ప్రవేశ పెట్టిన పీఎం ఈ-డ్రైవ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

పీఎం ఈ -డ్రైవ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.10,900 కోట్లు కేటాయించింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) కింద పీఎం ఈ-డ్రైవ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలు, ఎలక్ట్రిక్ అంబులెన్స్‌లు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఇతర ఈవీలను ప్రోత్సహించడానికి రూ.33,679 కోట్ల విలువైన రాయితీలు లేదా డిమాండ్ ప్రోత్సాహకాలను అందిస్తుంది. పీఎం ఈ-డ్రైవ్ ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ కార్లకు ప్రోత్సాహకాలు అందించడానికి బడ్జెట్ కేటాయింపులు లేవు. అంటే పీఎం ఈ -డ్రైవ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన కొనుగోలుదారులకు మద్దతు ఇవ్వదు. అయితే ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం పీఎం ఈ-డ్రైవ్ పథకం 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, 14,028 ఎలక్ట్రిక్ బస్సులకు మద్దతు ఇస్తుంది.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలు, ఎలక్ట్రిక్ అంబులెన్స్‌లు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఇతర ఈవీలకు సబ్సిడీలు, డిమాండ్ ప్రోత్సాహకాలను అందించడంతో పాటు పీఎం ఈ-డ్రైవ్ భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సౌకర్యాల అభివృద్ధి చేయడం కూడా కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం దేశవ్యాప్తంగా 88,500 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సైట్లకు మద్దతు ఇస్తుంది. పీఎం ఈ -డ్రైవ్ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ల కోసం 22,100 ఫాస్ట్ ఛార్జర్లను, ఎలక్ట్రిక్ బస్సులకు 1,800 ఫాస్ట్ ఛార్జర్లను, ఎలక్ట్రిక్ టూ-వీలర్స్, త్రీ-వీలర్లకు 48,400 ఫాస్ట్ ఛార్జర్లను 32,000 కోట్ల బడ్జెట్‌తో ఇన్‌స్టాల్ చేయడానికి ప్రతిపాదించింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు సమయంలో అంకితమైన పోర్టల్ ఈవీ కొనుగోలుదారు కోసం ఆధార్ ప్రామాణీకరించబడిన ఎలక్ట్రానిక్ వోచర్‌ను జనరేట్ చేస్తుంది. ముఖ్యంగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో ఈ-వోచర్ ని డౌన్‌లోడ్ చేసుకునేలా లింక్ వస్తుంది. కొనుగోలుదారు ఈ-వోచర్‌పై సంతకం చేసి డీలర్‌కు అందించాలి. డీలర్ కూడా ఈ-వోచర్ పై సంతకం చేసి పీఎం ఈ-డ్రైవ్ అంకితమైన పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. సంతకం చేసిన ఈ-వోచర్ కొనుగోలుదారు, డీలర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు. ఆటో తయారీదారులు సంతకం చేసిన ఈ-వోచర్లను ప్రభుత్వానికి సమర్పించడం ద్వారా పథకం కింద డిమాండ్ ప్రోత్సాహకాల రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..