Rent House: రెంట్ అగ్రిమెంట్ కేవలం 11 నెలలకే ఎందుకో తెల్సా.. దాటితే ఇల్లు మీదే.. కానీ.!

|

Aug 29, 2024 | 5:44 PM

ఓ ఇంట్లో ఎక్కువకాలం ఉంటున్న వ్యక్తి.. ఆ ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ బిల్లు కడుతూ, అద్దె కడితే.. ఆ ఇల్లు తనదే అవుతుందని అంటుంటారు. అలాగే చాలామంది యజమానులు ఇంటిని రెంట్‌కి ఇచ్చేటప్పుడు పలు కీలక విషయాలను టెనెంట్‌లకు చెబుతుంటారు.

Rent House: రెంట్ అగ్రిమెంట్ కేవలం 11 నెలలకే ఎందుకో తెల్సా.. దాటితే ఇల్లు మీదే.. కానీ.!
Rent
Follow us on

ఓ ఇంట్లో ఎక్కువకాలం ఉంటున్న వ్యక్తి.. ఆ ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ బిల్లు కడుతూ, అద్దె కడితే.. ఆ ఇల్లు తనదే అవుతుందని అంటుంటారు. అలాగే చాలామంది యజమానులు ఇంటిని రెంట్‌కి ఇచ్చేటప్పుడు పలు కీలక విషయాలను టెనెంట్‌లకు చెబుతుంటారు. చట్టం ఏం చెబుతోందన్నది పక్కన పెడితే.. కొందరు దీనిని నిజమని భావిస్తారు.. మరికొందరు నిజం కాదని కొట్టిపారేస్తారు. మరి అసలు అద్దెదారుడు ఎన్ని సంవత్సరాల పాటు ఓ ఇంట్లో అద్దె కడుతూ ఉండొచ్చు.? ఎన్ని నెలలు ఓ ఇంట్లో ఉంటే.. అతడికి ఆ ఇల్లు సొంతమవుతుంది.? అసలు చట్టం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఓ యజమానికి చెందిన ఆస్తిని.. అద్దెదారుడు తనదిగా క్లెయిమ్ చేయలేడు. అయితే ఎవరైనా కూడా 12 సంవత్సరాల పాటు ఓ ఇంటికి అద్దె కడుతూ ఉంటున్నట్లయితే.. ఆ ఆస్తిపై అతడికి హక్కు ఉంటుంది. అయితే అమ్మేందుకు వీలుపడదు. అసలింటికీ న్యాయ నిపుణులు చెబుతున్న అడ్వర్స్ పొసెషన్ అంటే ఏంటి? ఉదాహరణకు ఒక వ్యక్తి తన ఇంట్లో తన బంధువును అద్దె కడుతూ నివాసం ఉండటానికి అవకాశం ఇస్తే.. అతడు 11 సంవత్సరాలకు పైగా నివాసమున్నట్లయితే, అతడికి ఆ ఆస్తిపై హక్కు ఉన్నట్టే. అంటే ఆ వ్యక్తి ప్రతీ నెలా క్రమం తప్పకుండా అద్దె కడుతూ ఉండొచ్చన్న మాట. ఒకవేళ అతడు ఇంటి ఓనర్ ప్రమేయం లేకుండా ఆ ఇంటికి ఎలాంటి మరమ్మత్తులు, లేదా రెనోవేషన్ చేయించకపోతే ఆ వ్యక్తి అద్దె కడుతూ జీవితాంతం ఆ ఇంట్లోనే ఉండొచ్చు. దీనిని అడ్వర్స్ పోసెషన్ అని అంటారు.

ఇది చదవండి: షేర్ హోల్డర్లకు అంబానీ అద్దిరిపోయే న్యూస్.. 100 షేర్లకు మరో 100 ఫ్రీ

ఇవి కూడా చదవండి

మరోవైపు ఒక వ్యక్తి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ.. ఆ రసీదుపై తన పేరు కలిగి ఉంటే.. ఖచ్చితంగా ఓనర్ షిప్ హక్కులు ఆ వ్యక్తి అర్హుడు. దీనికి సేల్ డీడ్‌తో సంబంధం లేదు. కానీ 12 సంవత్సరాల పాటు ఓ వ్యక్తి ఓ ఇంట్లో ఉంటూ.. దాని ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్, కరెంట్ బిల్లులు కడుతుంటే.. ఇక ఆ బిల్లులపై ఓనర్ పేరు ఉంటే.. అద్దెకు ఉంటున్న వ్యక్తికి ఆ ఇల్లు సొంతం అవ్వదు. కేవలం అద్దెదారుడిగా ఆ వ్యక్తి జీవితాంతం ఆ ఇంట్లో ఉండొచ్చు. అతన్ని ఖాళీ చేయించలేరు. కాగా, 12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఒక ఇంట్లో ఉన్నవారిని అడ్వర్స్ టెనెంట్ అని అంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి