Air conditioner market: ఈ స్టాక్స్ కొంటే లాభాల పంటే.. ఏసీ కంపెనీల వాటాలకు పెరుగుతున్న ఆదరణ

జీవితంలో ముందుకు సాగడానికి, భవిష్యత్తు సక్రమంగా ఉండటానికి ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రణాళికలు చాలా అవసరం. సంపాదిస్తున్న ఆదాయాన్ని ప్రణాళికా బద్దంగా ఖర్చుచేసుకోవడంతో పాటు పాటు మిగిలిన ఆదాయాన్ని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఆధునిక కాలంలో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. దీర్ఘకాలంలో అత్యధిక సంపదను పొగుచేసుకునే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు.

Air conditioner market: ఈ స్టాక్స్ కొంటే లాభాల పంటే.. ఏసీ కంపెనీల వాటాలకు పెరుగుతున్న ఆదరణ
Stock Market

Updated on: Mar 03, 2025 | 12:40 PM

అనుభవం ఉంటే స్టాక్స్ లో సొంతంగా పెట్టుబడులు పెట్టవచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం దేశంలో ఎయిర్ కండిషనర్ మార్కెట్ జోరుగా విస్తరిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 17 శాతం సీఏజీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి సాధించనుంది. ఈ నేపథ్యంలో ఈ కింద తెలిపిన స్టాక్ లలో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో ఎయిర్ కండీషనర్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. మధ్యతరగతి ప్రజలతో పాటు సామాన్యులు కూడా వీటిని వినియోగిస్తున్నారు. మారుతున్న కాలం, పెరుగుతున్న జీవన విధానం, పట్టణ జీవితం తదితర అనేక కారణాలు దీని వెనుక ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2026 నుంచి 2030 మధ్య ఏసీ మార్కెట్ పరిమాణం 28 మిలియన్ల యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏసీ కంపెనీల స్టాక్ ప్రగతి వివరాలు ఇలా ఉన్నాయి.

అంబర్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్

అంబర్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.19,032.6 కోట్లుగా ఉంది. ఇటీవల ఈ స్టాక్ విలువ 0.3 శాతం పెరిగి రూ.5960కు చేరుకుంది. 2025 ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం దాదాపు 65.8 శాతం పెరిగి రూ.2133.3 కోట్లకు చేరింది. నికరలాభం విషయానికి వస్తే 2024లో రూ.0.5 కోట్ల నుంచి 25 నాటికి రూ.36 కోట్లకు పెరిగింది. రూమ్ ఎయిర్ కండీషనర్ల పరిశ్రమ (ఆర్ఏసీ)లో అంబర్ కంపెనీకి మంచి వాటా ఉంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, రైల్వే సబ్ సిస్టమ్, మొబిలిటీ, సేవలు, తయారీ వ్యాపారంలో కొనసాగుతోంది.

బ్లూస్టార్ లిమిటెడ్

బ్లూస్టార్ లిమిటెడ్ కంపెనీ స్టాక్ విలువ ఇటీవల దాదాపు 12 శాతం పెరిగి రూ.1950కి చేరుకుంది. దీని మార్కెట్ క్యాప్ విలువ రూ.39,392.7 కోట్లు. 2052 ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం దాదాపు 25.3 శాతం పెరిగి రూ.2807 కోట్లకు చేరింది. నికర లాభం 32 శాతం పెరిగి రూ.132 కోట్లుగా నమోదైంది. ఎయిర్ కండీషనింగ్, వాణిజ్య శీతలీకరణ, నీరు, గాలి శుద్దీకరణ, ఇంజినీరింగ్, ఆరోగ్యం తదితర విభాగాల్లో ఈ కంపెనీ సేవలు అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

వోల్టాస్ లిమిటెడ్

వోల్టాస్ లిమిడెట్ కంపెనీ స్టాక్ విలువ ఇటీవల రెండు శాతం పెరిగి రూ.1334.65కు చేరుకుంది. ఈ కంపెనీ ఆదాయం ఎఫ్ వై 25 మూడో త్రైమాసికంలో 18 శాతం పెరిగి రూ.3105కి చేరింది. అలాగే నికర లాభం రూ.131 కోట్లకు పెరిగింది. 2024 డిసెంబర్ నాటిని స్ప్లిట్, విండో ఎయిర్ కండీషనర్ల విభాగాల్లో మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది. దాదాపు 20.5 శాతం ఎగ్జిట్ మార్కెట్ వాటాను నమోదు చేసింది. నంబర్ 2 బ్రాండ్ గా తన ప్రస్థానం కొనసాగిస్తోంది. టాటా గ్రూపులో భాగంగా ఉన్న వోల్టాస్ లిమిటెడ్ కంపెనీ మైనింగ్, నిర్మాణ పరికరాలు, ఎలక్ట్రో మెకానికల్ పరికరాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తి సేవల వ్యాపారంలోనూ కొనసాగుతోంది.

కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్, రిఫ్రిజిరేషన్ లిమిటెడ్

కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్, రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ కంపెనీ ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో 68.2 శాతం పెరిగి రూ.111 కోట్లకు చేరుకుంది. నికర లాభం దాదాపు 75 శాతం పెరిగి రూ.14 కోట్లుగా నమోదైంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5419.4 కోట్లు ఉంది. ఈ కంపెనీ స్టాక్ విలువ ఇటీవల రెండు శాతం పెరిగి రూ.932.35కి చేరుకుంది. అల్యూమినియం, కాపర్ ఫిన్స్, కాపర్ ట్యూబ్స్ హీట్ ఎక్స్చేంజర్లు, వాటర్ కాయిల్స్, కండెన్సర్లు, ఎవాపరేట్ కాయిల్స్ లను తయారు చేస్తుంది.

మరిన్ని  బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి