Buy-Now Pay Later: పండగ సీజన్‌లో లోన్‌ తీసుకుని షాపింగ్‌ చేస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

|

Nov 06, 2023 | 4:43 PM

భారతదేశంలో రుణాలపై వస్తువులను కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది.. డిజిటల్ రుణాలు గత దశాబ్దంలో 39.5 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించాయి. లోన్ అప్లికేషన్, లోన్ చెల్లింపు ప్రక్రియను వేగవంతం, సులభతరం చేయడానికి వారు టెక్నాలజీని ఉపయోగిస్తారు. చాలా సార్లు రుణాలను కేవలం కొన్ని గంటల్లోనే ఇచ్చేస్తారు. ఈ డిజిటల్ లోన్‌లలో BNPL..

Buy-Now Pay Later: పండగ సీజన్‌లో లోన్‌ తీసుకుని షాపింగ్‌ చేస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Online Shopping
Follow us on

దీపావళికి మరికొద్ది రోజులే మిగిలి ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా షాపింగ్‌కు సిద్ధమవుతూ ఉంటారు. మీరు ఏదైనా పెద్ద ఎత్తున షాపింగ్ చేయాల్సి వస్తే మీరు రుణ సహాయం కూడా తీసుకోవచ్చు. మీరు వ్యక్తిగత రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. పండుగల సీజన్‌లో మార్కెట్లో రుణాలు ఇచ్చేందుకు చాలా సంస్థలు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ లోన్‌లు కూడా లోన్‌లలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

భారతదేశంలో రుణాలపై వస్తువులను కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది.. డిజిటల్ రుణాలు గత దశాబ్దంలో 39.5 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించాయి. లోన్ అప్లికేషన్, లోన్ చెల్లింపు ప్రక్రియను వేగవంతం, సులభతరం చేయడానికి వారు టెక్నాలజీని ఉపయోగిస్తారు. చాలా సార్లు రుణాలను కేవలం కొన్ని గంటల్లోనే ఇచ్చేస్తారు. ఈ డిజిటల్ లోన్‌లలో BNPL (బై నౌ పేలేటర్‌) లోన్ అంటే.. ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి అనే పద్దతి లో ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఏ కార్డ్ లేని కస్టమర్లు కూడా ఉపయోగించవచ్చు. ప్రతి ప్లాట్‌ఫామ్ మీకు పూర్తిగా వడ్డీ లేని సదుపాయాన్ని అందించదు. అవి ప్రాసెసింగ్, ప్రీపేమెంట్ లేదా పార్ట్-పేమెంట్ ఫీజులను కూడా వసూలు చేస్తాయి. బై నౌ పేలేటర్‌ విధానంలో స్పష్టమైన నిబంధనలు ఉంటాయి.

ఫిన్‌టెక్ కంపెనీలు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో అంటే NBFCలు లేదా బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా రుణాలను అందిస్తాయి. నో-కాస్ట్ EMI స్కీమ్ కోసం కస్టమర్‌లు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ కలిగి ఉండాలని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు. ఇంతకు ముందెన్నడూ రుణం తీసుకోని… క్రెడిట్ హిస్టరీ లేని కస్టమర్లకు… బై నౌ పే లేటర్‌ (buy-now-pay-later -BNPL) సరైన ఆప్షన్‌. అయితే బై నౌ పే లేటర్‌ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలు ఆలోచించుకోవడం ముఖ్యం.

ఇవి కూడా చదవండి

బై నౌ పే లేటర్‌ (బీఎన్‌పీఎల్‌)ని ఉపయోగించే ముందు, దీనికి విధించే వడ్డీ లేదా కొన్ని రకాల రుసుముల గురించి తెలుసుకోండి. ఈ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేక.. డిఫాల్ట్ అయినప్పుడు రికవరీ ఏజెంట్లు మానసిక వేధింపులకు గురి చేసే అవకాశం ఉంది. సౌలభ్యం వల్ల డిజిటల్ లెండింగ్ సేవలు కాని… బై నౌ పే లేటర్‌ వంటి రుణ సదుపాయాలు కాని.. చాలా ఆకర్షణీయంగా అనిపిస్తాయి. వీటన్నింటినీ ఆలోచించిన తర్వాత మాత్రమే రుణం తీసుకోండి. ఎందుకంటే మీరు కరెక్ట్ గా ప్లాన్ చేయకపోతే పండుగ సీజన్‌ను ఆస్వాదించడం తర్వాత.. ముందు మీ జేబుపై భారం పెరిగిపోతుందని మర్చిపోవద్దు.

కానీ రుణం తీసుకునే ముందు మీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవడం ముఖ్యం. అలాగే రుణం తీసుకునే ముందు భవిష్యత్తు ప్రభావాన్ని గుర్తుంచుకోండి. ఫిన్‌టెక్ నివేదిక ప్రకారం… భారతదేశ డిజిటల్ లెండింగ్ మార్కెట్ 2021లో $ 38.2 బిలియన్లుగా ఉంది. ఇది 2030 నాటికి $515 బిలియన్లకు పెరగవచ్చు. కస్టమర్‌లు కొనుగోలు చేసిన తర్వాత చెల్లింపును వాయిదా వేయడానికి అనుమతిస్తుంది. కస్టమర్ ఏకమొత్తంలో చెల్లింపు చేయవచ్చు లేదా ఎటువంటి అదనపు ఖర్చు లేని EMIలు.. వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. బై నౌ పే లేటర్‌తో అనవసరమైన ఖర్చుల ప్రమాదం పెరుగుతుంది. తెలివిగా ఉపయోగించుకోకపోతే కస్టమర్‌పై రుణ భారాన్ని పెంచేస్తుంది. తిరిగి చెల్లించడంలో జాప్యం జరిగితే.. ఛార్జీల భారం పెరుగుతుంది. దీని వల్ల మీ క్రెడిట్‌ స్కోర్‌ కూడా దెబ్బతింటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి