AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: మస్క్ ట్విట్టర్ కొనుగోలుపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోల్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Anand Mahindra: అమెరికన్ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌.. మైక్రోబ్లాకింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ‘వాక్‌ స్వాతంత్య్రం’పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సమయంలో దానిపై ఆనంద్ మహీంద్రా ఓ పోల్ నిర్వహించారు.

Anand Mahindra: మస్క్ ట్విట్టర్ కొనుగోలుపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోల్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
Anand Mahindra
Ayyappa Mamidi
|

Updated on: Apr 29, 2022 | 6:54 AM

Share

Anand Mahindra: అమెరికన్ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌.. మైక్రోబ్లాకింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ‘వాక్‌ స్వాతంత్య్రం’పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్విట్టర్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తానని మొదటి నుంచి మస్క్‌ అంటున్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా.. భారత ఈ అంశంపై దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా దీనిపై స్పందిస్తూ ఎలాన్ మస్క్‌ అభిప్రాయంతో ఏకీభవించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్‌ ఒప్పందం చేసుకున్న తర్వాత ఆనంద్‌ మహీంద్రా తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోల్‌ నిర్వహించారు. ‘‘ట్విట్టర్‌లో అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించేందుకు తక్కువ నిబంధనలు ఉంటాయని ఎలాన్‌ మస్క్‌ హామీ ఇచ్చారు. దీన్ని మీరు సమర్థిస్తున్నారా? లేదా?’’ అంటూ ఫాలోవర్లను అడిగారు. 80 శాతం మంది దీన్ని సమర్థిస్తున్నట్లు మహీంద్రా పోల్ కు బదులిచ్చారు.

తాజాగా ఈ ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’పై మరోసారి స్పందించిన మహీంద్రా.. ‘‘వాక్‌ స్వాతంత్య్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థమవుతోంది. ట్విట్టర్‌లో అభిప్రాయాలు పంచుకునేందుకు, తమ భావాలను వ్యక్తీకరించేందుకు మరింత మందికి అవకాశం ఇచ్చేలా మార్పులు జరగడాన్ని నేను కూడా అంగీకరిస్తున్నా. ఎందుకంటే.. విద్వేషాలను పెంచేవారిని సెన్సార్‌షిప్‌ అణచివేయలేదు. అయితే.. ట్విట్టర్‌ లాంటి వేదిక.. అలాంటి వారిని బయటపెట్టి దర్యాప్తు సంస్థలు వారిపై చర్యలు తీసుకునేలా చేయగలదు. ఏదేమైనా నకిలీ వార్తలు, నకిలీ పోస్ట్‌లును అరికట్టి.. రియల్‌ టైంలో వాస్తవ సమాచారాన్ని అందించే మరిన్ని సంస్థలు, వేదికలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని సోషల్ మీడియా ఖాతాలో రాశారు.

ట్విట్టర్‌ కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటినుంచి వాక్‌ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతోన్న మస్క్‌.. తాజాగా ఆ పదంపై స్పష్టత ఇచ్చారు. ‘ఫ్రీ స్పీచ్’ అనేది చట్టానికి లోబడి ఉండాలనేదే తన అభిప్రాయమని, చట్టానికి మించిన సెన్సార్‌ షిప్‌ను తాను వ్యతిరేకిస్తానని తాజాగా మస్క్‌ వివరణ ఇచ్చారు. ఇక ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు మస్క్‌ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ సాంకేతిక రంగంలోనే మూడో అతిపెద్ద కొనుగోలు లావాదేవీగా ఇది నిలిచింది.

ఇవీ చదవండి..

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు

Loyal Employee: ఒకే కంపెనీలో 100వ పుట్టిన రోజు జరుపుకున్న ఉద్యోగి.. రికార్డుతో గిన్నీస్ బుక్ లో చోటు..