Loyal Employee: ఒకే కంపెనీలో 100వ పుట్టిన రోజు జరుపుకున్న ఉద్యోగి.. రికార్డుతో గిన్నీస్ బుక్ లో చోటు..

Loyal Employee: సాధారణంగా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారు మహా అంటే రెండేళ్లో లేక ఐదేళ్లో పనిచేస్తారు. మహా అయితే రిటైర్ అయ్యేంత వరకు పనిచేస్తుంటారు. కానీ..

Loyal Employee: ఒకే కంపెనీలో 100వ పుట్టిన రోజు జరుపుకున్న ఉద్యోగి.. రికార్డుతో గిన్నీస్ బుక్ లో చోటు..
Loyal Employee
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 28, 2022 | 10:06 PM

Loyal Employee: సాధారణంగా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారు మహా అంటే రెండేళ్లో లేక ఐదేళ్లో పనిచేస్తారు. మహా అయితే రిటైర్ అయ్యేంత వరకు పనిచేస్తుంటారు. కానీ.. వీటికి భిన్నంగా ఒక మనిషి ఎనిమిది దశాబ్ధాలకు పైగా ఒకే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ వార్త వినగానే ఆయన ఎవరా అనే ఆసక్తి మీలో ఎక్కువైంది కదూ. బ్రెజిల్‌కు ఓ వ్యక్తి మాత్రం.. గత 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తూ.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆయనే వాల్టర్ ఓర్త్‌మాన్(Walter Orthmann). అత్యధిక కాలం ఒకే సంస్థలో పని చేసినందుకు గానూ.. ఆయనకు గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు దక్కింది. ఇటీవల ఆయన తన 100వ పుట్టినరోజును కూడా కంపెనీలోనే జరుపుకున్నారు. వాల్టర్ ఓర్త్‌మాన్ బ్రస్క్‌లోని రెనాక్స్ ఎస్​.ఏ అనే టెక్స్‌టైల్ కంపెనీలో 1938 జనవరి 17 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. తన 15వ ఏట ఆయన ఈ కంపెనీలో చేరారు.

షిప్పింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా తన కెరీర్​ను ప్రారంభించారు వాల్టర్. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌, సేల్స్ మేనేజర్‌ ఇలా పలు పదవుల్లో పని చేశారు. తన 84 ఏళ్ల సుదీర్ఘ కెరీర్​లో వాణిజ్య పరంగా అనేక మార్పులను చూశారు. సేల్స్​ మేనెజర్​గా ఉన్నప్పుడు విదేశాల పర్యటనకు వెళ్లేవారు. ఆ సమయంలో తొమ్మిది రకాల తొమ్మిది వేర్వేరు కరెన్సీ డినామినేషన్లలో లావాదేవీలు జరిపిన అనుభవం ఆయన సొంతం. బ్రెజిల్​ విమానయాన చరిత్రలో దాదాపు అన్ని రకాల వాణిజ్య విమానయాన సంస్థలను వాల్టర్​ వినియోగించడం విషేషం. పని చేయడానికి ఇష్టపడాలి. నేను అదే స్ఫూర్తితో పని చేస్తున్నానంటూ కారణం తెలిపారు. ఇంతటి సుధీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్న వాల్టర్.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి చోటు సంపాదించారు. ఏప్రిల్ 19న వాల్టర్​ 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన తన ఉద్యోగాన్ని కొనసాగించాలనే భవిస్తున్నారు.

ఆఫీస్ లోనే 100వ పుట్టినరోజు జరుపుకుంటూ..

ఆఫీస్ లోనే 100వ పుట్టినరోజు జరుపుకుంటూ..

రెనాక్స్ ఎస్​.ఏ కంపెనీలో చేరిన తొలినాళ్లను ఆయన గుర్తు చేసుకుంటూ.. ఫోన్లు, కంప్యూటర్లు లేని రోజులను నెమరువేసుకున్నారు. వీధులు సరిగా లేకుండా వర్షం పడితే బురదగా మారేవని తెలిపారు. అప్పట్లో ఇంటికో బావి ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సాంకేతికత వల్ల ఎక్కడి నుంచైనా వ్యాపారం చేయవచ్చని.. ఈ వెసులుబాట్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పనిలో కోపం వద్దని.. నవ్వుతూ పని చేస్తే చేసే పని కచ్చితంగా నచ్చుతుందని ఆయన అంటున్నారు. శతృత్వం వద్దు.. అవసరం అయితే క్షమాపణలు చెప్పండి. ప్రశాంతంగా జీవించండి. జీవితాన్ని ఆస్వాదించండి అని ఆయన తన జీవిత విశేషాలను అందరికీ తెలిపారు.

ఇవీ చదవండి..

Multibagger Returns: బంగారం లాంటి లాభాలను అందించిన జ్యూవెలరీ కంపెనీ.. లక్షను.. రూ.12 లక్షలు చేసింది..

Infosys News: ఇన్ఫోసిస్ కు తిప్పలు తెచ్చిన కొత్త నిబంధనలు.. మరోపక్క వేలల్లో ఉద్యోగుల రాజీనామాలు..