AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan Mohan Reddy: ఏపీ సీఎంను కలిసిన ATA ప్రతినిధులు.. తెలుగు మహా సభలకు రావాలంటూ ఆహ్వానం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) ప్రతినిధులు సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

YS Jagan Mohan Reddy: ఏపీ సీఎంను కలిసిన ATA ప్రతినిధులు.. తెలుగు మహా సభలకు రావాలంటూ ఆహ్వానం..
American Telugu Association Ys Jagan Mohan Reddy
Venkata Chari
|

Updated on: Apr 28, 2022 | 10:33 PM

Share

American Telugu Association: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) ప్రతినిధులు సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వాషింగ్టన్‌ డీసీలో జులై 1 నుంచి 3 వరకు జరగనున్న 17వ ఆటా తెలుగు మహా సభలకు ఆహ్వానించారు. క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ని కలిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాదరెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్‌ కమిటీ ఛైర్మన్‌ సన్నీరెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌ జయంత్‌ చల్లా ఉన్నారు. వాషింగ్టన్‌డీసీలో జరగబోయే ఆటా తెలుగు మహాసభలకు ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. కరోనాతో రెండేళ్లుగా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. కాగా, ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ తెలుగు మహాసభలను భారీఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

American Telugu Association Ys Jagan Mohan Reddy (1)

10వేలకు పైగా ప్రజలు ఈ మహా సభలకు రానున్నారని జనం హాజరవుతారని ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల తెలిపారు. ఈమేరకు 65 కమిటీలను కూడా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఇందులో దాదాపు 350 మంది సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సభ్యులంతా ఆటా తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తారని ఆయన తెలిపారు.

మరిన్ని గ్లోబర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Vijaya Gadde: తెలుగు మహిళను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ని కొన్న వెంటనే ఎందుకిలా చేస్తున్నాడంటే..

Esha NagiReddi: అమెరికాలో అథ్లెటిక్స్‌ విభాగంలో సత్తాచాటుతున్న తెలుగు యువతి..