Business Idea: జస్ట్ రూ.5 వేలతో ఇంట్లోనే ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి.. నెలకు రూ.లక్షల్లో ఆదాయం మీ సొంతం
త్వరలో దీపావళి వస్తున్న క్రమంలో కొవ్వోత్తులకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. దీంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. కొవ్వోత్తుల తయారీకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. తక్కువ ఖర్చుతో మీరు ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలనేది చూద్దాం

తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చే బిజినెస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే. కేవలం రూ.5 వేలు ఉంటే చాలు.. మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేయవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. అదే క్యాండిల్ బిజినెస్. ప్రస్తుత మార్కెట్లో విభిన్నమైన అనేక రకాల కొవ్వోత్తులు వస్తున్నాయి. ఇవి ఆకర్షణీయమైన డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. మీరు డిమాండ్ ఉన్న ప్రత్యేకమైన క్యాండిల్స్‌పై దృష్టి సారించడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందే ఛాన్స్ ఉంది. సాధారణ క్యాండిల్స్ కాకుండా.. చక్ర హీలింగ్ క్యాండిల్స్, ఆరా క్లెన్సింగ్ క్యాండిల్స్ వంటి వాటిని తయారుచేయడం ద్వారా అధిక లాభాలను పొందే అవకాశముంది. ఈ క్యాండిల్స్ కేవలం కాంతిని ఇవ్వడమే కాకుండా.. నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అందుకే వీటికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. చక్ర హీలింగ్ క్యాండిల్స్ ఏడు చక్రాల కోసం ఏడు వేర్వేరు రంగులు, సుగంధ ద్రవ్యాలతో చేస్తారు. ఒక సెట్ ధర రూ.1200 నుండి రూ.2 వేల వరకు ఉంటుంది. వాటిలో స్వచ్ఛమైన బీ వ్యాక్స్, సహజ సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు.
ఎలా స్టార్ట్ చేయాలి..?
రూ.5 వేల పెట్టుబడి ప్రధానంగా ముడి సరుకుల కొనుగోలుకు సరిపోతుంది. జార్స్, వ్యాక్స్ (బీ వ్యాక్స్ లేదా ప్యూర్ వ్యాక్స్), సహజ రంగులు, సుగంధ ద్రవ్యాలు వంటివి కొనుగోలు చేయాలి. మౌల్డ్స్ అవసరం లేకుండా జార్స్తో పనిచేయవచ్చు. ఈ ప్రత్యేకమైన క్యాండిల్స్‌ను ఎలా తయారుచేయాలి, వాటి ప్రాసెస్ ఏమిటి అనే దానిపై పూర్తి జ్ఞానం, నైపుణ్యం అవసరం. సరైన టెక్నిక్‌లు లేకుండా చేస్తే పెట్టుబడి వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకేసారి వంద రకాల క్యాండిల్స్ తయారుచేయడానికి ప్రయత్నించకుండా.. చక్ర హీలింగ్ లేదా ఆరా క్లెన్సింగ్ క్యాండిల్స్ వంటి ఒకే రకం ఉత్పత్తిపై దృష్టి సారించండి. దీని వల్ల ముడి సరుకుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. మీరు ముడి పదార్థాలను బల్క్‌గా కొనుగోలు చేయడం వల్ల జార్స్ వంటి వాటికి తక్కువ ఖర్చు అవుతుంది. 500 జార్స్ కొంటే ఒక్కోటి రూ.10 పడవచ్చు. అదే 10-20 జార్స్ కొంటే ఒక్కోటి రూ.25 నుంచి రూ.30 అవుతుంది. ఈ క్యాండిల్స్‌కు ప్రస్తుతం ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. మెడిటేషన్ క్లాసులు చెప్పేవాళ్లు, మానిఫెస్టేషన్ నిపుణులు, రేకీ హీలర్స్, సౌండ్ హీలర్స్ వంటి వారు తమ కస్టమర్లకు, విద్యార్థులకు వీటిని రికమెండ్ చేస్తారు. అలాంటి వారిని మీరు కలిసి వీటిన విక్రయించవచ్చు.
ఎలా విక్రయించాలి..?
సొంతంగా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీలు సృష్టించుకోవడం ద్వారా కూడా మార్కెటింగ్ చేయవచ్చు. గిఫ్ట్ షాపులు, సూపర్ మార్కెట్లలో కూడా వీటిని ఉంచవచ్చు. ఈ వ్యాపారాన్ని ఎవరైనా ప్రారంభించవచ్చు. పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, ఉద్యోగం చేసేవారు కూడా పార్ట్‌టైమ్‌గా దీనిని చేయవచ్చు. రూ.5 వేల పెట్టుబడితో రూ.లక్షల్లో సంపాదించవచ్చు. ఎవరైనా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనుకుంటే ఇది మంచి వ్యాపార ఆలోచనగా చెప్పవచ్చు.
