Halwa Ceremony 2023: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ తయారీలో దాగివున్న శ్రమ అంతా ఇంతా కాదు. చర్చల మీద చర్చల తర్వాత బడ్జెట్‌ను రూపొందిస్తుంది కేంద్రం. ఇక బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఫిబ్రవరి 26న నిర్వహించే హల్వా వేడుకలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామణ సమక్షంలో బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులు పాల్గొంటారు. ఈ వేడుక కేంద్ర బడ్జెట్‌ను రూపొందించే చివరి దశను సూచిస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కడాయిలో హల్వాను తయారు చేయడం ద్వారా వేడుకను ప్రారంభించి ఢిల్లీలోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో వారి సహచరులకు వడ్డిస్తారు. బడ్జెట్‌కు సమావేశాలకు ముందు ఈ హల్వా వేడుకను నిర్వహిస్తుంటారు. అయితే గురువారం నుంచి ఫిబ్రవరి 1 వరకు బడ్జెట్‌కు సంబంధించిన అధికారులందరూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఉంటారు.
భారతదేశంలో ఏదైనా శుభ కార్యం చేసే ముందు ఏదైనా స్వీట్స్‌తో పంచుకోవడం సంప్రదాయం ఉంటుంది. అదే విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి హల్వా వేడుకను నిర్వహిస్తారు. ఏళ్ల తరబడి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. బడ్జెట్‌కు ముందు హల్వా వేడుకలు నిర్వహించి నోటిని తీపి చేసుకోనున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి