Income Tax: బడ్జెట్‌లో మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌పై ఊరట.. పన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు.. వారికి మాత్రమే

|

Feb 01, 2023 | 4:35 PM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మసీలాతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆదాయపు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Income Tax: బడ్జెట్‌లో మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌పై ఊరట.. పన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు.. వారికి మాత్రమే
Income Tax Slab
Follow us on

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మసీలాతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆదాయపు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజల కోరికలను నెరవేర్చారు. ఇప్పుడు సామాన్యులు రూ.7 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్మలా సీతారామన్ ఇప్పుడు రూ.5 లక్షల వరకు ఆదాయంపై లభించే పన్ను రాయితీ పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. అయితే ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే. చాలా ఏళ్లుగా ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఈ ప్రకటనతో పాటు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో సామాన్యులకు ఈ భారీ ఊరటను అందించారు. ఇది కాకుండా కొత్త పన్ను విధానం పన్ను శ్లాబ్‌ను కూడా ప్రభుత్వం మార్చింది. ఇప్పుడు కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను కొత్త స్లాబ్ ఈ క్రింది విధంగా ఉంటుంది. అయితే రూ. 0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. దీని బట్టి చూస్తే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది. ఏటా 7 లక్షల వరకు సంపాదిస్తున్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆదాయపు పన్ను శ్లాబులను 6 నుంచి 5కి తగ్గించారు.

కొత్త ఆదాయపు పన్నులో శ్లాబ్ అప్‌డేట్

  • రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.
  • రూ. 3 నుండి రూ. 6 లక్షల వరకు 5 శాతం
  • రూ. 6 నుండి రూ. 9 లక్షల వరకు 10 శాతం
  • రూ. 9 నుంచి రూ. రూ.12 లక్షల వరకు 15 శాతం
  • రూ. 12 నుండి రూ.15 లక్షల వరకు 20 శాతం
  • రూ. 15 లక్షల పైన 30 శాతం పన్ను వర్తిస్తుంది.

ఇప్పటివరకు దేశంలో రూ.2.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల ఆదాయానికి 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు ఆదాయంపై పన్ను రాయితీని కూడా ఇస్తుంది.

Tax

దీని ప్రకారం..  ఆదాయం రూ. 7లక్షలు దాటితే 3 లక్షల ఆదాయం నుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.9 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు, రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలుగా ట్యాక్స్‌ ఉండనుంది. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌ల సగటు ప్రాసెసింగ్ సమయాన్ని 93 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించారు. ఇక కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గానే ఉంటుందని, ప్రజలు పాత పన్ను విధానాన్ని కూడా ఎంచుకునేందుకు ఆప్షన్ ఉంటుందని నిర్మలమ్మ ప్రకటించారు. ఇక అత్యధిక ట్యాక్స్ రేటు 42.7 శాతం ఉందని, కొత్త పన్ను విధానంలో సర్ ఛార్జీని 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. దీంతో అత్యధిక ట్యాక్స్ రేటు 39 శాతానికి చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి