BMW Mini Cooper: ఈ కార్‌ను ఓ సారి చార్జ్ చేస్తే ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు సింపుల్‌గా వెళ్లవచ్చు..!

|

Feb 15, 2023 | 5:35 PM

నెదర్లాండ్స్‌లోని బ్రాండ్ ఫ్యాక్టరీలో కేవలం 999 యూనిట్లను తయారు చేస్తుంది. ఎనిగ్మాటిక్ బ్లాక్, వైట్ సిల్వర్ కలర్స్‌లో ఈ కార్ లభ్యం కానుంది. మెరుగైన డోర్ హ్యాండిల్స్, సైడ్ విండోస్, ఫ్రంట్, బ్యాక్ టెయిల్ లైట్లతో ఆకర్షనీయంగా ఈ కార్ ఉండనుంది.

BMW Mini Cooper: ఈ కార్‌ను ఓ సారి చార్జ్ చేస్తే ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు సింపుల్‌గా వెళ్లవచ్చు..!
Mini Cooper Se
Follow us on

బీఎండబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన మిని కంపెనీ తన మొదటి ప్రొడెక్షన్ ఆల్-ఎలక్ట్రిక్ కన్వర్జబుల్ మోడల్ కూపర్ ఎస్ఈ కన్వర్జబుల్ ఆవిష్కరించింది. ఈ కొత్త కన్వర్జబుల్ కార్‌ను నెదర్లాండ్స్‌లోని బ్రాండ్ ఫ్యాక్టరీలో కేవలం 999 యూనిట్లను తయారు చేస్తుంది. ఎనిగ్మాటిక్ బ్లాక్, వైట్ సిల్వర్ కలర్స్‌లో ఈ కార్ లభ్యం కానుంది. మెరుగైన డోర్ హ్యాండిల్స్, సైడ్ విండోస్, ఫ్రంట్, బ్యాక్ టెయిల్ లైట్లతో ఆకర్షనీయంగా ఈ కార్ ఉండనుంది. అలాగే ఈ కార్ పరిమిత తయానీ దృష్టిలో పెట్టుకుని డోర్స్ సిల్స్, సైడ్‌లపై 1/999 అక్షరాలతో వస్తుంది. ఫ్రంట్ గ్రిల్ స్థానంలో స్మూత్ బాడీతో వినియోగదారులను ఆకట్టుకునే కార్ డిజైన్ ఉంది. ఈ కార్ 17 ఇంచుల అలాయ్ వీల్స్‌తో తయారు చేశారు. అలాగే ఈ కార్‌లో ప్రధానంగా ఉన్న కన్వర్టబుల్ టాప్ 30 కిలో మీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు మాత్రమే తెరవవచ్చు/మూసివేయవచ్చని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ కార్‌ ఇన్నర డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. కన్వర్టబుల్ హీటెడ్ సీట్లు, అడ్జస్టబుల్ థై సపోర్ట్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, స్టార్ట్-స్టాప్ స్విచ్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది. 

ఆకట్టుకుంటున్న అధునాతన ఫీచర్లు

మినీ కూపర్ ఎస్ఈ కన్వర్టిబుల్ 184 హార్స్ పవర్, 270 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 135 కెడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది.  ఈ కార్ కేవలం 8.2 సెకన్లలో 100 కి.మి స్పీడ్‌ను అందుకుంటుంది. అలాగే ఈ కార్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 201 కి.మి మైలేజ్ ఇస్తుంది. అంటే ఈ కార్‌ను ఓ సారి చార్జ్ చేసి ఈజీగా ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళ్లవచ్చు. ఈ మినీ కూపర్ ఎస్ సీబీయూ ద్వారా గతేడాది భారత్‌లో లాంచ్ చేశారు. అలాగే కన్వర్టబుల్ వెర్షన్ తీసుకునే బ్యాటరీ పరిమాణాన్ని వెల్లడించనప్పటికీ 32.6 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీను ఉపయోగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కూపర్ ఎస్ఈ ఫాస్ట్ చార్జర్‌తో వస్తుంది. 11 కేడబ్ల్యూ బ్యాటరీను ఉపయోగించి 2.5 గంటల్లో 0-80 శాతం వరకూ బ్యాటరీను చార్జ్ చేయవచ్చు. అలాగే 50 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ చార్జర్‌పై 36 నిమిషాల్లో చార్జ్ అవ్వడం ఈ కార్ ప్రత్యేకత. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..