BMW Scooter: వాహన రంగంలో బీఎండబ్ల్యూ దూసుకుపోతోంది. ఇందులో కారైనా.. బైకైనా.. తనదైన కొత్త ప్రత్యేకతలతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. త్వరలో ఈ కంపెనీ ఇండియాలో BMW C 400 GT స్కూటర్‌ని లాంచ్ చేయనుంది. BMW డీలర్‌షిప్‌లలో ఇప్పటికే 100 బుకింగ్‌లు నమోదైనట్లు తెలుస్తోంది. ఇది భారతీయుల దృష్టిని ఆకర్షించనుంది. ఈ స్కూటర్‌లో సరికొత్త ఫీచర్స్ ఉన్నాయి.
ఆప్రాన్-మౌంటెడ్ హెడ్‌లైట్, విండ్‌స్క్రీన్, స్ప్లిట్-స్టైల్ ఫుట్‌బోర్డ్, స్పోర్టిగా కనిపించే పిలియన్ గ్రాబ్‌లతో స్టైలిష్‌గా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. LED లైటింగ్, రైడ్-బై-వైర్ థొరెటల్, కీలెస్ ఇగ్నిషన్, హీటెడ్ గ్రిప్స్, సీట్లు, యాంటీ-థెఫ్ట్ అలారం, మోటరోరాడ్ కనెక్టివిటీ, మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. C 400 GT 350 cc సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.
ఇది 7,500 rpm వద్ద 34 hp పవర్, 35 Nm గరిష్ట టార్క్‌ను 5,750 rpm వద్ద అందిస్తుంది. ఇంజిన్ CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. గరిష్టంగా139 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది. స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు సర్దుబాటు చేయగల డ్యూయల్ స్ప్రింగ్-లోడెడ్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. అలాగే ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, వెనుకవైపు సింగిల్ డిస్క్ యూనిట్‌ను కలిగి ఉంది.
BMW C 400 GT ప్రీమియం ధర ట్యాగ్‌తో వస్తుందని భావిస్తున్నారు. దాదాపుగా లక్ష బుకింగ్ వస్తాయని అంచనా వేస్తున్నారు. సుమారు రూ.7 లక్షల ధర ఉంటుందని తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా BMW C 400 GT మారనుంది.