Paytm: ఈ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.. పేటీఎం కీలక అప్‌డేట్‌

పేటీఎంలో యూపీఐ సాధారణంగా పని చేస్తుంది. ఎలాంటి అంతరాయం లేకుండా సేవలను కొనసాగించేందుకు ఇతర బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాము. వినియోగదారులు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. అంతకుముందు కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ శనివారం వర్చువల్ టౌన్ హాల్‌ను ఏర్పాటు చేశారు.

Paytm: ఈ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.. పేటీఎం కీలక అప్‌డేట్‌
Paytm

Updated on: Feb 06, 2024 | 8:53 AM

పేటీఎం యూపీఐ సర్వీస్‌పై పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. యూపీఐ సర్వీస్‌ యథావిధిగా కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. దీన్ని కొనసాగించేందుకు కంపెనీ ఇతర బ్యాంకులతో కలిసి పనిచేస్తోంది. Paytm UPI సర్వీస్‌ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కింద వస్తుంది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల నుంచి డబ్బు తీసుకోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నిలిపివేసింది. ఆ తర్వాత మూడు ట్రేడింగ్ రోజుల్లో పేటీఎం షేర్లు 42 శాతానికి పైగా క్షీణించాయి.

ఈ సందర్భరంగా పేటీఎం అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. పేటీఎంలో యూపీఐ సాధారణంగా పని చేస్తుంది. ఎలాంటి అంతరాయం లేకుండా సేవలను కొనసాగించేందుకు ఇతర బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాము. వినియోగదారులు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. అంతకుముందు కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ శనివారం వర్చువల్ టౌన్ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో కంపెనీ అధికారులే కాకుండా కంపెనీకి చెందిన దాదాపు 900 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఏ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించబోమని శర్మ చెప్పారు. సమస్య పరిష్కారానికి ఆర్బీఐ, ఇతర బ్యాంకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సంక్షోభం త్వరలోనే పరిష్కారమవుతుందని అన్నారు.

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం.. డిసెంబర్‌లో బ్యాంకులలో అత్యధిక యూపీఐ లబ్ధిదారుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) ఉంది. డిసెంబర్‌లో పేటీఎం పేమెంట్ బ్యాంక్ యాప్‌లో కస్టమర్లు రూ.16,569.49 కోట్ల విలువైన 144.25 కోట్ల లావాదేవీలు జరిపారు. పేటీఎం భారత్ బిల్ చెల్లింపు ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) వ్యాపారం కూడా PPBL పరిధిలోకి వస్తుంది. ఈ సేవ విద్యుత్, నీరు, పాఠశాల, విశ్వవిద్యాలయ ఛార్జీల వంటి బిల్లు చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి