Indian Railways: రైలు ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌.. ఆధార్‌ లేకున్నా తత్కాల్‌ టికెట్లు!

Indian Raiwlays: ఈ కొత్త వ్యవస్థ ప్రస్తుత వ్యవస్థ కంటే 10 రెట్లు వేగంగా ఉంటుంది. ప్రస్తుత వ్యవస్థ నిమిషానికి 32,000 టికెట్ బుకింగ్‌లను నిర్వహించగలదు. కానీ కొత్త వ్యవస్థ నిమిషానికి 1.5 లక్షల టికెట్ బుకింగ్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది మాత్రమే..

Indian Railways: రైలు ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌.. ఆధార్‌ లేకున్నా తత్కాల్‌ టికెట్లు!

Updated on: Jul 22, 2025 | 4:30 PM

ఇటీవల భారత రైల్వే తత్కాల్‌ టికెట్ల విషయంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకునే వారు ఐఆర్‌సీటీసీ (IRCTC) అకౌంట్‌కు ఆధార్‌ కార్డు లింక్‌ చేయడం తప్పనిసరి చేసింది. ఆధార్‌ లింకు చేసుకోకుంటే తత్కాల్ టికెట్లను బుక్‌ చేసుకునేందుకు వీలుండదు. జూలై 1వ తేదీ నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకోవాలన్నా ఆధార్‌ అథంటికేషన్‌ తప్పనిసరి అని ప్రకటించింది రైల్వే. జూలై 15 నుంచి రిజర్వేషన్‌ కౌంటర్లలోనూ ఆధార్‌ ఆధారిత ఓటీపీ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆధార్‌ వివరాలు లేకున్నా రిజర్వేషన్‌ కౌంటర్లలో తత్కాల్‌ టికెట్లను జారీ చేస్తున్నారు. మూడు రోజులుగా రిజర్వేషన్‌ సిబ్బంది ఆధార్‌ లేకుండానే టికెట్లు జారీ చేస్తున్నారు. ఆధార్‌ అథంటికేషన్‌ ప్రక్రియలో ఏర్పడిన టెక్నికల్‌ సమస్యల కారణంగా కొత్త విధానాన్ని తాత్కాలింగా వాయిదా వేసినట్లు సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (సీఆర్‌ఐఎస్‌) అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: School Holiday: విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..

సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న కారణంగా రిజర్వేషన్‌ కౌంటర్లలో తత్కాల్‌ టికెట్ల కోసం మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన రైల్వే అధికారులు.. ప్రస్తుతానికి ఆధార్‌ లింక్‌ విధానాన్ని వాయిదా వేసినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక నిమిషంలో నాలుగు టికెట్లు ఇస్తున్నామని, కొత్త విధానంలో ఆధార్‌ అథంటికేషన్‌ ఓటీపీని నమోదు చేయాల్సి వస్తే ప్రతీ టికెట్టు జారీకి కనీసం 52 సెకన్ల చొప్పున సమయం పడుతుందని అంటున్నారు. టికెట్‌ జారీలో జాప్యాన్ని నివారించడం సాధ్యం కాకపోవడంతో తాత్కాలింగా వాయిదా వేసిందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Bank Holiday: ఖాతాదారులకు అలర్ట్‌.. జూలై 23న బ్యాంకులు మూసి ఉంటాయా? లేదా?

కొత్త రిజర్వేషన్ వ్యవస్థను సిద్ధం:

రైల్వేలు తన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేయబోతున్నాయి. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ఈ పనిని నిర్వహిస్తోంది. ఈ కొత్త వ్యవస్థ డిసెంబర్ 2025 నాటికి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ కొత్త వ్యవస్థ ప్రస్తుత వ్యవస్థ కంటే 10 రెట్లు వేగంగా ఉంటుంది. ప్రస్తుత వ్యవస్థ నిమిషానికి 32,000 టికెట్ బుకింగ్‌లను నిర్వహించగలదు. కానీ కొత్త వ్యవస్థ నిమిషానికి 1.5 లక్షల టికెట్ బుకింగ్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది మాత్రమే కాదు, ప్రస్తుత వ్యవస్థ నిమిషానికి 4 లక్షల విచారణలను ప్రాసెస్ చేస్తుంది. కొత్త వ్యవస్థ నిమిషానికి 40 లక్షల విచారణలను నిర్వహిస్తుందని రైల్వే వర్గాల ద్వారా సమాచారం.

ఇది కూడా చదవండి: Toll Tax Free: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. వీరికి టోల్‌ ట్యాక్స్‌ ఉండదు!

ఇది కూడా చదవండి: Auto News: మీ కారు మైలేజీ ఇవ్వడం లేదా? ఈ ట్రిక్‌తో పది నిమిషాల్లోనే మైలేజీ పెంచుకోవచ్చు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి