Tata-Ambani: ఎన్నికల ఫలితాలకు ముందు టాటా-అంబానీలకు భారీ నష్టం
ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 48 గంటల కంటే తక్కువ సమయం ఉంది. అంతకు ముందు దేశంలోని రెండు అతిపెద్ద కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ అతిపెద్ద కంపెనీ టీసీఎస్. గత వారం రెండు కంపెనీల షేర్లలో క్షీణత కనిపించింది. దీంతో రెండు కంపెనీల మార్కెట్ క్యాప్‌లో భారీ క్షీణత కనిపించింది...
ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 48 గంటల కంటే తక్కువ సమయం ఉంది. అంతకు ముందు దేశంలోని రెండు అతిపెద్ద కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ అతిపెద్ద కంపెనీ టీసీఎస్. గత వారం రెండు కంపెనీల షేర్లలో క్షీణత కనిపించింది. దీంతో రెండు కంపెనీల మార్కెట్ క్యాప్‌లో భారీ క్షీణత కనిపించింది.
అయితే దేశంలోని టాప్ 10 కంపెనీల్లో ఈ 8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ మాత్రమే రూ.1.33 లక్షల కోట్లకు పైగా నష్టాన్ని చవిచూశాయి. దీనికి విరుద్ధంగా దేశంలోని రెండు అతిపెద్ద రుణదాతలైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ బ్యాంక్‌ల మార్కెట్ క్యాప్ పెరిగింది. రెండూ కలిపి వాటి మార్కెట్ క్యాప్‌లలో రూ.12 వేల కోట్లు పెరిగాయి. ఇందులో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అత్యధిక వాటాను కలిగి ఉంది.
గత వారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ 1,449 పాయింట్లు లేదా 1.92 శాతం పడిపోయింది. శుక్రవారం అది 75.71 పాయింట్లు లేదా 0.10 శాతం ఎక్కువతో 73,961.31 వద్ద ముగిసింది. దాని ఐదు రోజుల నష్టాల పరంపరను బ్రేక్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 3, 4 తేదీలపైనే ఉంటుంది. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి ప్రభావం కనిపించనుంది అనేది చాలా ముఖ్యం.
దేశంలోని టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ ఎంత పెరిగింది.. ఎంత తగ్గిందో తెలుసా?
- ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ.67,792.23 కోట్లు తగ్గి రూ.19,34,717.12 కోట్లకు చేరుకుంది.
- టాటా గ్రూప్‌లోని అతిపెద్ద కంపెనీ అయిన టీసీఎస్ ఎమ్‌కాప్ రూ.65,577.84 కోట్లు క్షీణించి రూ.13,27,657.21 కోట్లకు చేరుకుంది.
- దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ వాల్యుయేషన్ రూ.24,338.1 కోట్లు తగ్గి రూ.5,83,860.28 కోట్లకు చేరింది.
- దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.12,422.29 కోట్లు తగ్గి రూ.5,32,036.41 కోట్లకు చేరుకుంది.
- దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ ఎంక్యాప్ రూ.10,815.74 కోట్లు తగ్గి రూ.6,40,532.52 కోట్లకు చేరుకుంది.
- మరోవైపు హెచ్‌యూఎల్ వాల్యుయేషన్ రూ.9,680.31 కోట్లు తగ్గింది. ఆ తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,47,149.32 కోట్లకు చేరుకుంది.
- దేశంలోని పెద్ద టెలికాం కంపెనీలలో భారతీ ఎయిర్‌టెల్ ఎమ్‌క్యాప్ రూ.9,503.31 కోట్లు తగ్గి రూ.7,78,335.40 కోట్లకు చేరుకుంది.
- దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ రుణదాత ఐసిఐసిఐ బ్యాంక్ ఎమ్ క్యాప్ రూ.8,078.11 కోట్లు తగ్గి రూ.7,87,229.71 కోట్లకు చేరుకుంది.
- దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎమ్‌క్యాప్ రూ.10,954.49 కోట్లు పెరిగి, వాల్యుయేషన్ రూ.11,64,083.85 కోట్లకు చేరుకుంది.
- దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రుణదాత ఎస్‌బీఐ రూ. 1,338.7 కోట్లను జోడించి, మార్కెట్ విలువను రూ. 7,40,832.04 కోట్లకు చేరుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి