Small Savings Accounts: చిన్న మొత్తాల పొదుపుతో పెద్ద మొత్తంలో ఆదాయం.. ఆ పథకాల్లో పెట్టుబడితో కళ్లుచెదిరే వడ్డీ రేట్లు

|

Aug 21, 2024 | 8:00 AM

చాలా మంది పెట్టుబడిదారులు ఏళ్లుగా అందుబాటులో ఉన్న సంప్రదాయం చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి కంటే అధిక లాభానిచ్చే స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడి పెడుతూ ఉన్నారు. పెట్టుబడిదారులు తమ ఆదాయాలను పెంచుకోవడానికి స్టాక్ మార్కెట్ వైపు కదులుతున్నప్పటికీ వారు తమ ఆస్తుల కేటాయింపులను వైవిధ్యపరచడానికి స్థిర ఆదాయ వనరుల కోసం చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు.

Small Savings Accounts: చిన్న మొత్తాల పొదుపుతో పెద్ద మొత్తంలో ఆదాయం.. ఆ పథకాల్లో పెట్టుబడితో కళ్లుచెదిరే వడ్డీ రేట్లు
Post Office Saving Scheme
Follow us on

భారతదేశంలో ఇటీవల కాలంలో అక్షరాస్యతా శాతం గతంతో పోల్చుకుంటే బాగా పెరిగింది. అలాగే పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ఆర్థిక అక్షరాస్యతా శాతం కూడా అదే స్థాయిలో పెరిగిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది పెట్టుబడిదారులు ఏళ్లుగా అందుబాటులో ఉన్న సంప్రదాయం చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి కంటే అధిక లాభానిచ్చే స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడి పెడుతూ ఉన్నారు. పెట్టుబడిదారులు తమ ఆదాయాలను పెంచుకోవడానికి స్టాక్ మార్కెట్ వైపు కదులుతున్నప్పటికీ వారు తమ ఆస్తుల కేటాయింపులను వైవిధ్యపరచడానికి స్థిర ఆదాయ వనరుల కోసం చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో చిన్నమొత్తాల పొదుపు పథకాలుగా ప్రాచుర్యం పొందిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై), పోస్టాఫీసు డిపాజిట్లు వంటి పథకాల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో? ఓసారి తెలుసుకుందాం. 

చిన్న పొదుపు పథకాలు మూడు విభాగాలుగా ఉంటాయి. పొదుపు డిపాజిట్లు, సామాజిక భద్రతా పథకాలు, నెలవారీ ఆదాయ ప్రణాళిక విభాగాలుగా ఉంటాయి. పొదుపు డిపాజిట్లలో 1-3 సంవత్సరాల టైమ్ డిపాజిట్లు, 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు ఉంటాయి. వీటిలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (ఎన్ఎస్‌సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వంటి పొదుపు ధ్రువపత్రాలు కూడా ఉన్నాయి. సామాజిక భద్రతా పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి ఖాతా, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఉన్నాయి. నెలవారీ ఆదాయ ప్రణాళికలో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఇటీవల కాలంలో అధిక ప్రజాదరణ పొందింది.

ప్రస్తుతం అధిక ప్రజాదరణ పొదుపు పథకమైన పీపీఎఫ్‌లో వడ్డీ 7.1 శాతంగా ఉంటే సేవింగ్స్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4 శాతంగా ఉంది. కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. అలాగే కిసాన్ వికాస్ పత్ర పెట్టుబడులు 115 నెలల్లో మెచ్యూర్ అవుతాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ)పై వడ్డీ రేటు 7.7 శాతంగా కొనసాగుతోంది. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పథకంలో పెట్టుబడిదారులకు 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. అయితే పీపీఎఫ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, టర్మ్ డిపాజిట్లు, ఎన్ఎస్‌సీ, ఎస్ఎస్వై వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికం చివరిలో సమీక్షిస్తారు. తదనుగుణంగా తదుపరి త్రైమాసికానికి వడ్డీ రేటు నిర్ణయిస్తారు. మునుపటి త్రైమాసికంలో జీ-సెక్ రాబడి ఆధారంగా రేటు సమీక్ష జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..