AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Connection: జూన్ తర్వాత వీరికి గ్యాస్ కట్.. కేంద్రం షాకింగ్ డెసిషన్..!

గ్యాస్ కొరత క్రమంలో కేంద్ర ప్రభుత్వం మార్చిలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పీఎన్‌జీ కనెక్షన్ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అందులోకి తప్పనిసరిగా మారాల్సిందేనని నిబంధనలు విదించింది. మూడు నెలల సమయం ఇవ్వగా.. జూన్‌తో గడువు ముగియనుంది. దీంతో జూన్ తర్వాత వారి ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేస్తారనే ప్రచారం సాగుతోంది.

Gas Connection: జూన్ తర్వాత వీరికి గ్యాస్ కట్.. కేంద్రం షాకింగ్ డెసిషన్..!
Lpg Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Jun 03, 2026 | 8:57 PM

Share

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ అనే నిబంధనను అమలు చేసేందుకు సిద్దమైంది. అందులో భాగంగా ఎల్పీజీ,పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నవారి కోసం కొత్త ప్రోటోకాల్‌ను ప్రకటించింది. ఎల్పీజీ లేదా పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్‌జీ)లలోల ఏదో ఒక కనెక్షన్ మాత్రమే కలిగి ఉండాలి. రెండు కనెక్షన్లను కలిగి ఉండటానికి వీల్లేకుండా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. మీరు పీఎన్‌జీ కనెక్షన్‌కు మారినట్లయితే ఎల్పీజీ కనెక్షన్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రాంతంలో పీఎన్‌జీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రస్తుతం వినియోగిస్తున్న ఎల్పీజీ కనెక్షన్‌ను వదులుకోవాల్సి ఉంటుంది.

30 రోజుల్లోపు నిలిపివేత

పీఎన్జీ కనెక్షన్‌ పొందిన 30 రోజుల్లోపు LPG కనెక్షన్‌లను గ్యాస్ ఏజెన్సీలు నిలిపివేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎల్పీజీ కనెక్షన్‌ను నిలిపివేసిన తర్వాత మీరు భవిష్యత్తులో పీఎన్‌జీ సౌకర్యం లేని ప్రాంతానికి మారినట్లయితే ఎల్పీజీ కనెక్షన్‌ను తిరిగి పొందడానికి వీలుగా రీప్లేస్‌మెంట్ వోచర్‌ అందించాలని కేంద్రం సూచించింది. భవిష్యత్తులో పీఎన్‌జీ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాలకు వలస వెళ్లే వినియోగదారులకు ఇది పెద్ద ఊరటగా చెప్పవచ్చు.

జూన్‌తో  గడువు ముగింపు

పీఎన్‌జీ కనెక్షన్ సౌకర్యం లేని ప్రాంతాలకు తరలివెళ్లే ఉద్యోగులు, వలస కుటుంబాలు, అద్దెదారులు, విద్యార్థులు, కుటుంబాలకు ఈ డ డెసిషన్ వల్ల ఊరట కలగనుంది. అయితే హోటల్స్, రెస్టారెంట్స్ వంటి వాణిజ్య సంస్థలకు PNG కనెక్షన్లు అందించేందుకు గ్యాస్ కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. IGL, MGL, Gail Gas, BPCL వంటి కంపెనీలు ఈ కనెక్షన్లు మంజూరు చేస్తున్నాయి. అయితే పీఎన్‌జీ కనెక్షన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల ప్రజలు పీఎన్‌జీలోకి మారేందుకు కేందర్ం మూడు నెలల గడువు విధించింది. పీఎన్‌జీకి మారకపోతే ఎల్పీజీ సరఫరా నిలిపివేస్తామని మార్చిలో ప్రకటించారు. ఈ గడువు జూన్‌లో ముగుస్తుంది. దీంతో కనెక్షన్లను రద్దు చేయడానికి మాత్రం ఎలాంటి గడువు ప్రకటించలేదు. దీంతో జూన్ తర్వాత ఏం జరుగుంతుందనేది చూడాలి.

Follow Us