Airtel: టెలికాం రంగంలో ఎయిర్‌టెల్‌కు లాభాల పంట.. రెండో త్రైమాసికంలో రూ.1,134 కోట్లు ఆదాయం

| Edited By: Ravi Kiran

Nov 03, 2021 | 6:37 AM

Airtel: టెలికాం రంగంలో పలు సంస్థలు లాభాలు పొందుతుంటాయి. లాభాలతో పాటు వినియోగదారులను పెంచుకుంటున్నాయి. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ..

Airtel: టెలికాం రంగంలో ఎయిర్‌టెల్‌కు లాభాల పంట.. రెండో త్రైమాసికంలో రూ.1,134 కోట్లు ఆదాయం
Follow us on

Airtel: టెలికాం రంగంలో పలు సంస్థలు లాభాలు పొందుతుంటాయి. లాభాలతో పాటు వినియోగదారులను పెంచుకుంటున్నాయి. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక సెప్టెంబర్‌ 2021 త్రైమాసికంలో రూ.1,134 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ మంగళవారం తెలిపింది. కస్టమర్ల పెరుగుదలతో తమ వ్యాపారం బాగా కొనసాగుతోందని తెలిపింది. అయితే అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో రూ.763.2 కోట్ల నష్టం వాటిల్లిందని కంపెనీ వెల్లడించింది. FY21 రెండో త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం రూ.28,326.4 కోట్లుగా ఉంది. ఇది ఏడాది ప్రతిపాదికన 18.8 శాతం పెరిగింది. నివేదిక ఆధారంగా పరిశీలిస్తే.. ఏడాది ప్రాతిపదికన 13 శాతం లాభపడింది.

ఇక 16 దేశాల్లో ఎయిర్‌టెల్‌ వినియోగదారుల సంఖ్య దాదాపు 480 మిలియన్లుగా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో దాని మొత్తం క్యాపెక్స్‌ వ్యయం రూ.6,972 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. అలాగే టెలికాం పరిశ్రమల కోసం ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను స్వాగతిస్తున్నట్లు సీఈవో గోపాల్‌ మిట్టల్‌ తెలిపారు. ఇది పరిశ్రమ పెట్టుబడి సామర్థ్యాన్ని పెంచుతుందని అన్నారు. ఇది భారతదేశ డిజిటల్‌ పరిశ్రమ ముందుకు సాగడానికి సహాయపడుతుందని వెల్లడించారు. సంస్కరణల ప్రక్రియ కొనసాగుతుందని, పరిశ్రమను ప్రభావితం చేసే అన్ని విషయాల కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు. భారతీ ఎయిర్‌టెల్‌ ఏజీఆర్‌, స్పెక్ట్రమ్‌ బకాయిలపై నాలుగు సంవత్సరాల చెల్లింపు మారటోరియంను ఎంచుకుంది. అయితే టెలికాం రంగానికి ప్రభుత్వం అందిస్తున్న రిలీఫ్‌ ప్యాకేజీలో భాగంగా దీనిని ప్రవేశపెట్టారు.

ఇవి కూడా చదవండి:

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో చేరి ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు..!

Gold Carats: 24 క్యారెట్ల బంగారం.. 22 క్యారెట్ల బంగారానికి తేడా ఏమిటి..? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..!