Airtel: ఎయిర్‌టెల్‌కు పెరిగిన ఆదాయం.. జూన్‌ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభం..!

|

Aug 04, 2021 | 6:33 AM

Airtel: భారతీయ ఎయిర్‌టెల్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఏజీఆర్‌ బకాయిల

Airtel: ఎయిర్‌టెల్‌కు పెరిగిన ఆదాయం.. జూన్‌ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభం..!
Follow us on

Airtel: భారతీయ ఎయిర్‌టెల్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఏజీఆర్‌ బకాయిల కోసం భారీ మొత్తంలో కేటాయింపులు చేయడంతో సంస్థ రూ.15,993 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. మొత్తం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 15.3 శాతం పెరిగి రూ.26,854 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన 4.2శాతం పెరిగింది. మార్చి త్రైమాసిక లాభం రూ.759.2 కోట్లతో పోలిస్తే 62 శాతం తగ్గుముఖం పట్టింది. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయం రూ.138 నుంచి రూ.146కు పెరిగినట్లు నివేదికలు తెలిపాయి. మార్చి త్రైమాసికంలో ఇది రూ.145గా నమోదు కాగా, ఒక్కో డేటా వినియోగదారు నెలకు సరాసరిన 18.5 జీబీల డేటా వినియోగించగా, 1,044 వాయిస్‌ కాల్స్‌ చేసినట్లు ఎయిర్‌టెల్‌ వెల్లడించింది.

భారత ఆదాయాలు జూన్‌ త్రైమాసికంలో 19.2శాతం పెరిగి రూ.18,828 కోట్లకు చేరుకున్నాయి. మొబైల్‌ ఆదాయాలు కూడా 4జీ వినియోగదార్లు అధికంగా జత కావడం వల్ల 21.9శాతం పెరిగాయి. సమీక్షా త్రైమాసికంలో 51 లక్షల మంది 4జీ వినియోగదార్లు కొత్తగా చేరారు. డిజిటల్‌ టీవీ వ్యాపారం 8.7 శాతం మేర పెరిగింది. 16 దేశాల్లో కలిపి ఎయిర్‌టెల్‌కు సుమారు 47.4 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నారు.

ఇవీ కూడా చదవండి

Home Loan: మీరు హోమ్‌ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? వివిధ బ్యాంకుల తాజా వడ్డీ రేట్లు ఇవే..!

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 15న విడుదల.. మరిన్ని వివరాలు