AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారంపై పెట్టుబడి చాలు.. రూట్‌ మార్చేయండి..! ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం..గ్రాము ధర తెలిస్తే..

కాలిఫోర్నియం-252 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం. దీని ఒక గ్రాము ధర 200 కిలోల బంగారంతో సమానం. ఇది సహజంగా లభించదు; అణు రియాక్టర్లలో ప్రత్యేక ప్రక్రియ ద్వారా మానవులు దీనిని ఉత్పత్తి చేస్తారు. క్యాన్సర్ చికిత్సలో న్యూట్రాన్ థెరపీ, చమురు అన్వేషణ, పారిశ్రామిక పరీక్షలలో దీనికి కీలక ఉపయోగాలున్నాయి. దాని అరుదైన ఉత్పత్తి, న్యూట్రాన్లను విడుదల చేసే సామర్థ్యం దీనికి అపారమైన విలువను ఇస్తుంది.

బంగారంపై పెట్టుబడి చాలు.. రూట్‌ మార్చేయండి..! ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం..గ్రాము ధర తెలిస్తే..
Most Expensive Metal
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2026 | 2:00 PM

Share

సాధారణంగా మనం బంగారం, వజ్రాలను అత్యంత ఖరీదైన వస్తువులుగా భావిస్తాము. కానీ, ప్రపంచంలో వీటి కంటే ఖరీదైన లోహం కూడా ఉందని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. ఎందుకంటే..ఆ లోహం 1 గ్రాము ధర 200 కిలోల బంగారంతో సమానం. అవును మీరు విన్నది నిజమే..అది కాలిఫోర్నియా-252 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థాలలో ఒకటి. దీని ఒక గ్రాము ధర దాదాపు 200 కిలోల బంగారం. ఇది సహజ లోహం కాదు, అంటే దీనిని గని నుండి తీయలేము. మానవులు అణు రియాక్టర్లలో ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా కాలిఫోర్నియంను ఉత్పత్తి చేస్తారు. అంటే ఇది పూర్తిగా ప్రయోగశాలలో సృష్టించిన సింథటిక్ మూలకం.

1950లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ శాస్త్రవేత్తలు దీన్ని తొలిసారి తయారు చేశారు. అందుకే ఆ రాష్ట్రం పేరుతో దీనికి కాలిఫోర్నియం అనే పేరు పెట్టారు. అంతేకాదు.. ఈ కాలిఫోర్నియం ఉత్పత్తి కూడా చాలా సంక్లిష్టమైనది. చాలా సమయం తీసుకుంటుంది. దీని కోసం క్యూరియం వంటి భారీ మూలకాలను నెలల తరబడి న్యూట్రాన్ రేడియేషన్‌కు గురిచేయడం జరుగుతుంది. సుదీర్ఘ ప్రక్రియ తర్వాత కూడా, దాని ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కాలిఫోర్నియం-252 అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే.. అది ఆకస్మికంగా న్యూట్రాన్లను విడుదల చేస్తుంది. న్యూట్రాన్లను ఉత్పత్తి చేయడం అంత సులభం కాదు, కాలిఫోర్నియం-252 ఈ సామర్థ్యం దానిని చాలా విలువైనదిగా, అరుదైనది చేస్తుంది.ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలు, కొన్ని ప్రత్యేక ల్యాబ్‌లు మాత్రమే దీనిని తయారు చేయగలవు.

ఇంత ఖరీదైన మూలకం అయినప్పటికీ దీన్ని ఆభరణాల కోసం ఉపయోగించరు. కాలిఫోర్నియం-252ను క్యాన్సర్ చికిత్సలో న్యూట్రాన్ థెరపీ కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇతర చికిత్సలు పనిచేయని సందర్భాల్లో ఇది కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. చమురు, వాయువు అన్వేషణ, న్యూట్రాన్ రేడియోగ్రఫీ, పారిశ్రామిక పరీక్షలలో ఉపయోగించబడుతుంది. ఇక్కడ ఎలాంటి ఇతర పదార్థాలు దానిని భర్తీ చేయలేవు. పనిచేసే రియాక్టర్ లేకపోయినా ఇది శక్తివంతమైన న్యూట్రాన్ మూలంగా ఉంటుంది. అందుకే ఇది విలువైనది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us