సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరి ఆశిస్తుంటారు. వారి వారి ఆదాయాలు, ఖర్చులకు అనుగుణంగా పొదుపు చేస్తుంటారు. అయితే ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు రిస్క్ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ రిటర్న్స్ రావాలని ఆశిస్తుంటారు. మరికొందరు తక్కువ రిటర్న్స్ ఉన్నా సరే రిస్క్ ఉండకూదని కోరుకుంటారు.
రిస్క్ లేకుండా రిటర్న్స్ పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో మీ డబ్బుకు ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇలాంటి వారి కోసం పోస్టాఫీస్ కొన్ని మంచి పథకాలను అమలు చేస్తోంది. ఇంతకీ పోస్టాఫీస్ అందిస్తున్న ఆ పథకాలు ఏంటి.? వాటి వల్ల ఎలాంటి ఆదాయం పొందొచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం..
* పోస్టాఫీస్ అందిస్తోన్న బెస్ట్ సేవింగ్ స్కీమ్స్‌లో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి. ఈ పథకంలో కనీసం రూ. 500 నుంచి పెట్టుబడిగా పెట్టొచ్చు. ఈ సేవింగ్స్ అకౌంట్‌ను పెద్దలతో పాటు మైనర్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. ఈ పథకం కింద 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
* పోస్టాఫీస్ అందిస్తోన్న మరో బెస్ట్ పథకాల్లో నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా ఒకటి. ఇందులో కనీస నెలవారీ డిపాజిట్ రూ.100గా ఉంటుంది. వార్షిక వడ్డీ రేటు 5.8శాతంగా ఉంటుంది.
* పోప్టాఫీస్ అందిస్తోన్న నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతాలో గరిష్ట పెట్టుబడి పరిమితులు ఉండవు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఐదేళ్ల కాలానికి పోస్టాఫీస్ సేవింగ్స్ ప్లాన్ కింద 6.7 శాతం వడ్డీ లభిస్తుంది.
* పోస్టాఫీస్ అందిస్తోన్న మరో బెస్ట్ స్కీమ్స్‌లో నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ ఒకటి. ఇందులో 6.6 శాతం వడ్డీ రేటును అందిస్తారు. ఇది అతి చిన్న పెట్టుబడి పథకం. కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా 4.5 లక్షలు, ఉమ్మడిగా 9 లక్షల వరకూ డిపాజిట్ చేయొచ్చు.
* 60 ఏళ్లు నిండిన వారి కోసం పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను తీసుకొచ్చారు. ఈ పథకానికి 55 ఏళ్లు పైబడి, పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు గానీ, 50 ఏళ్లు పైబడిన రిటైర్డ్ సైనిక సిబ్బందికి గానీ అనుమతి లేదు. అవసరమైన కనీస పెట్టుబడి రూ.1000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకూ పెట్టుబడి పెటొచ్చు. ఈ పథకం కింద 7.4శాతం వడ్డీ రేటు అందించబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..