New Toll Charges 2024: వాహనదారులకు బిగ్ అలర్ట్.. పెరిగిన టోల్ ఛార్జీలు.. ఏ వాహనానికి ఎంత ధర అంటే..!

వాహనదారులకు అలర్ట్.. టోల్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5 శాతం పెరిగాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే.. పెరిగిన టోల్ రేట్లు మార్చి 31, 2025 వరకు అమల్లో ఉంటాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒకవైపు ప్రయాణానికి టోల్‌ ఛార్జీ రూ.5 పెరగగా.. బస్సులు, ట్రక్కులు ఒక వైపు ప్రయాణానికి 25 రూపాయలు, రెండు వైపులా ప్రయాణానికి 35 రూపాయలు పెరిగాయి.

New Toll Charges 2024: వాహనదారులకు బిగ్ అలర్ట్.. పెరిగిన టోల్ ఛార్జీలు.. ఏ వాహనానికి ఎంత ధర అంటే..!
New Toll Charges 2024
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 03, 2024 | 11:29 AM

వాహనదారులకు అలర్ట్.. టోల్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5 శాతం పెరిగాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే.. పెరిగిన టోల్ రేట్లు మార్చి 31, 2025 వరకు అమల్లో ఉంటాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒకవైపు ప్రయాణానికి టోల్‌ ఛార్జీ రూ.5 పెరగగా.. బస్సులు, ట్రక్కులు ఒక వైపు ప్రయాణానికి 25 రూపాయలు, రెండు వైపులా ప్రయాణానికి 35 రూపాయలు పెరిగాయి. భారీ సరకు రవాణా వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ. 35, రెండు వైపులా కలిసి రూ.50 వరకు టోల్‌ ఛార్జీలు పెంచారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని వాహనాలకు 25 శాతం రాయితీ లభిస్తుంది. స్థానికుల నెలవారీ పాస్‌పైనా రూ.10 పెంచడంతో.. నెలవారీ పాస్‌ రేట్‌ రూ.330 నుంచి 340కి పెరిగింది. వాహనదారులకు ధరలపై ఆందోళన లేకుండా టోల్​ప్లాజాల వద్ద బోర్డులను ఏర్పాటు చేసినట్టు నిర్వహణ సంస్థ తెలిపింది.

ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ఛార్జీలు సైతం పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2024 -25 కి సంబంధించి టోల్ చార్జీలను సగటున ఐదు శాతం పెంచుతున్నట్లు ఐఆర్‌బీ ఇన్ఫ్రా సంస్థ ప్రకటించింది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ ను ఐఆర్బి సమస్త గత ఏడాది 30 ఏళ్ల వరకు లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నిబంధన ప్రకారం ఐదు శాతం వరకు టోల్ చార్జీలను పెంచుకునేటటువంటి వెలుసు బాటు ఉంది. ఇందులో భాగంగానే కొత్త ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ రకాల వాహనాలను 6 క్యాటగిరీలోగా విభజించి చార్జీలను నిర్ణయించారు. కొత్తచార్జిలపై అవగాహన కోసం టోల్ ప్లాజా వద్ద బోర్డులను సైతం ఏర్పాటు చేశారు.

కాగా.. ఏటా టోల్ చార్జీలను ఏప్రిల్ ఒకటిన పెంచుతారు. కానీ ఈసారి లోక్ సభ ఎన్నికల కారణంగా ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 1తో చివరి దశ పోలింగ్ ముగియడంతో టోల్ ధరల పెంపునకు ఈసి అనుమతి ఇచ్చింది.

ఆరు కేటగిరీలు వారీగా.. ఛార్జీలు ఇలా..

6 కేటగిరీలుగా టోల్ చార్జీలను విభజించారు. ప్రతి కిలోమీటర్ కి వాహనాన్ని బట్టి ఛార్జీలను పెంచారు. కారు, జీపు లాంటి వెహికల్స్ కు 2.34 రూపాయలు.. కాగా మినీ బస్సుకు 3.77 ఇక బస్సు రెండు ఆక్సిల్ ఉన్న ట్రక్కుకు 6.69, మూడు ఆక్సిల్ ఉన్నటువంటి వాహనాలకు 8.63 రూపాయలు.. ఇక భారీ నిర్మాణ యంత్రాలు ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ నాలుగు ఐదు ఆరు ఆక్సిల్ ఉన్నటువంటి ట్రక్కులకు 12.40, భారీ వాహనాలు 7 అంతకంటే ఎక్కువ యాక్సిస్ ఉన్న వాహనాలకు 15.09 టోల్ ఛార్జీలను విధించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..