Best Gold Loan Offers: గోల్డ్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? అతి తక్కువ వడ్డీ రేట్లు అందించే 5 బ్యాంకులివే..
వ్యక్తిగత లోన్స్ కంటే.. గోల్డ్ లోన్స్‌కే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే.. గోల్డ్ లోన్‌లో వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది, డాక్యూమెంటేషన్, ప్రాసెస్ టైమ్ పెద్దగా ఉండదు.

వ్యక్తిగత లోన్స్ కంటే.. గోల్డ్ లోన్స్‌కే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే.. గోల్డ్ లోన్‌లో వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది, డాక్యూమెంటేషన్, ప్రాసెస్ టైమ్ పెద్దగా ఉండదు. నిమిషాల్లోనే అవసరమైన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార అవసరాలు గానీ, ఊహించని ఖర్చులు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం తక్షణ నగదు అవసరమైతే గోల్డ్‌లోన్‌ను ఆశ్రయించడం జరుగుతుంది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన తరువాత బ్యాంకులు కుదవ పెట్టిన ఆభరణాలను తిరిగి ఇచ్చేస్తాయి. ఇందులో రిస్క్ ఏమీ ఉండదు. అయితే, గోల్డ్ లోన్‌పై ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా వడ్డీ రేటు ఉంటుంది. బంగారు రుణాలపై ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకుల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింద వివరాలను గమనించవచ్చు.
బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు..
1. ఇండియన్ బ్యాంక్ – 7.00 శాతం నుంచి మొదలవుతుంది. తీసుకున్న రుణంపై 0.56 % ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
2. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 7.10% నుంచి 7.20% వరకు ఉంటుంది. 0.75% ప్రాసెసింగ్ ఫీజు.




3. యూనియన్ బ్యాంక్ – 7.25% నుంచి 7.50% వరకు ఉంటుంది.
4. యూకో బ్యాంక్ – 7.40% నుంచి 7.90% వరకు ఉంటుంది. రూ. 250 నుంచి 5,000 వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
5. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ – 7.60% నుంచి 16.81% వరకు ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం వరకు ఉంటుంది.
వ్యవసాయేతర ప్రయోజనాల కోసం గోల్డ్ లోన్..
ఏప్రిల్ 1, 2022 నాటి ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం.. ‘‘వ్యవసాయయేతర ప్రయోజనాల కోసం గోల్డ్ లోన్స్ తిరిగి చెల్లించడానికి బ్యాంకులు నెలవారీ, త్రైమాసిక వాయిదాలను నిర్ణయించాలి. ఆదాయం, రుణగ్రహీతల రీపేమెంట్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అసలు, వడ్డీ వాయిదాలు 90 రోజులకు మించి ఉంటే అటువంటి బంగారు రుణ ఖాతాలను ఎన్‌పీఏ లుగా పరిగణించవచ్చు’’
వ్యవసాయ ప్రయోజనం కోసం బంగారు రుణాలు..
“వ్యవసాయ అవసరాల కోసం మంజూరు చేయబడిన గోల్డ్ లోన్స్‌కు సంబంధించి.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వార్షిక వ్యవధిలో వడ్డీని వసూలు చేయాలి. అసలు మొత్తాన్ని పంటల కోత సమయంలో చెల్లించాలి. దీని ప్రకారం.. గడువు తేదీ తర్వాత కూడా అసలు, వడ్డీ వాయిదాలు చెల్లించనట్లయితే వాటిని NPAగా పరిగణించబడతాయి” అని ఆర్బీఐ పేర్కొంది.
గోల్డ్ లోన్ LTV..
లోన్-టు-వాల్యూ(LTV) రేషియో అనేది రుణదాత మీకు రుణంగా అందించే కొలేటరల్ మార్కెట్ విలువలో భాగం. ఆర్బీఐ ప్రకారం.. ‘‘ఏప్రిల్ 1, 2021 తర్వాత మంజూరు చేయబడిన తాజా గోల్డ్ లోన్స్ LTV నిష్పత్తి 75 శాతంగా ఉంటాయి.’’
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..