Business Idea: ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
మారిన జీవన విధానం నేపథ్యంలో ఇటీవల చాలా మంది మంచి ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వాటిలో పుట్టగొడుగులు ఒకటి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న పుట్టగొడులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే పుట్టగొడులకు డిమాండ్ బాగా పెరుగుతోంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా రెస్టరంట్‌లు అందుబాటులోకి రావడం పుట్టగొడుగు సంబంధిత వంటకాలు...
వ్యాపారం చేయాలనే కోరిక మనలో చాలా మందిలో ఉంటుంది. పెరుగుతోన్న ఆర్థిక అవసరాల నేపథ్యంలో చాలా మంది చేస్తున్న ఉద్యోగంతో పాటు వ్యాపారంలోనూ అడుగుపెడుతున్నారు. కేవలం సంపన్నులు మాత్రమే కాకుండా మధ్య తరగరతి వారు కూడా వ్యాపారం ప్రారంభించి రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరి చేస్తున్న ఉద్యోగం మానేయకుండానే మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉన్న ఒక బెస్ట్ వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మారిన జీవన విధానం నేపథ్యంలో ఇటీవల చాలా మంది మంచి ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వాటిలో పుట్టగొడుగులు ఒకటి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న పుట్టగొడులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే పుట్టగొడులకు డిమాండ్ బాగా పెరుగుతోంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా రెస్టరంట్‌లు అందుబాటులోకి రావడం పుట్టగొడుగు సంబంధిత వంటకాలు అందుబాటులోకి రావడంతో వీటికి మంచి గిరాకీ పెరిగింది. దీంతో పుట్టగొడుగుల పెంపకాన్ని మంచి వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నారు. ఇంతకీ పుట్టగొడుగుల తయారీ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి.? ఎలాంటి లాభాలు ఉంటాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
పుట్టగొడుల తయారీని కేవలం రూ. 5 వేలతోనే ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఈ వ్యాపారం కోసం మీకు పెద్దగా పెట్టుబడి లేదా స్థలం కూడా అవసరం లేదు. ఇంట్లోనే ఒక చిన్న గదిలో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పుట్టగొడుగులను పెంచేందుకు అవసరమైన నేల, విత్తనాలు ఉంటే సరిపోతుంది. పుట్టగొడుగులను పెంచడం ప్రారంభించిన తర్వాత కేవలం 20 నుంచి 25 రోజుల్లో పెరగడం మొదలవుతుంది. లాభాల విషయానికొస్తే ప్రస్తుతం మార్కెట్లో పుట్టగొడుగుల ధర కిలో రూ.100 నుంచి 150గా ఉంది.
రిటైల్ మార్కెట్ విషయానికొస్తే 200 గ్రాముల పుట్టగొడుల ప్యాకెట్ రూ. 40గా ఉంది. రెస్టరంట్‌లతో పాటు సూపపర్ మార్కెట్లతో ముందస్తుగా ఒప్పందం చేసుకోవడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చు. పుట్టగొడుగుల వ్యాపారం ద్వారా నెలకు తక్కువలో తక్కువ రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు ఆదాయం పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..