Bank Holidays In May: బ్యాంకులో పని ఉందా ? తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సిందేనా ? అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవడం మంచిది. బ్యాంకులకు మే నెలలో కొన్ని సెలవులు ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకోవడం మంచిది. అందుకు అనుగుణంగా బ్యాంక్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో బ్యాంకులు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. బ్యాంకుల పని వేళల్లో మార్పులు జరిగాయి. దీంతో బ్యాంకులు మధ్యాహ్నం వరకే ఓపెన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI హాలిడే క్యాలెండర్ ప్రకారం.. బ్యాంకులకు మే నెలలో 12 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే ఇప్పటికే అందులో కొన్ని సెలవులు గడిచిపోయాయి. మిగిలినవి ఇంకా 7 రోజులు ఉన్నాయి. మరీ అవి ఎప్పుడెప్పుడూ ఉన్నాయో తెలుసుకుందామా.
మే 13, 2021: రంజాన్
మే 14, 2021: భగవాన్ శ్రీ పరశురామ్ జయంతి/Akshaya Tritiya
మే 16, 2021: ఆదివారం
మే 22, 2021: నాలుగో శనివారం
మే 23, 2021: ఆదివారం
మే 26, 2021: బుద్ధ పూర్ణిమ
మే 30, 2021: ఆదివారం
ఇదిలా ఉంటే.. బ్యాంకు హాలిడేస్.. రాష్ట్రం ప్రాతిపదికన మారుతూంటాయి. ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే మరో రాష్ట్రంలో హాలిడే ఉండకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ క్లోజ్ లా ఉన్నా కూడా ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చు. ఏటీఏం, మొబైల్ బ్యాంకింగ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు లభిస్తాయి.
Also Read: మహిళలకు గుడ్న్యూస్… కేంద్రం కీలక నిర్ణయం.. వారి అకౌంట్లోకి రూ.5000.. ఎలా అప్లై చేసుకోవాలంటే…
MEIL: కరోనా బాధితులకు అండగా మేఘా సంస్థ.. ఆసుపత్రులకు ఉచిత ఆక్సిజన్ సరఫరాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్
Work from Home: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ఇంటి నుంచి విధులు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి