బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. ఈ సర్వీసులలో మారిన విషయాలు ఇవే..

|

May 24, 2021 | 12:28 PM

Bank Of Baroda : ప్రస్తుత కరోనా నేపథ్యంలో పలు బ్యాంకులు తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి కొన్ని కొత్త నిబంధనలను తీసుకువస్తున్నాయి.

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. ఈ సర్వీసులలో మారిన విషయాలు ఇవే..
Banks
Follow us on

Bank Of Baroda : ప్రస్తుత కరోనా నేపథ్యంలో పలు బ్యాంకులు తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి కొన్ని కొత్త నిబంధనలను తీసుకువస్తున్నాయి. అలాగే మరికొన్ని బ్యాంకులు కస్టమర్లకు సులభంగా విత్ డ్రా, ట్రాన్స్ క్షన్స్ చేసుకునేలా వీలు కల్పిస్తున్నారు. తాజాగా మరోసారి బ్యాంక్ రూల్స్ మారబోతున్నాయి. రాబోయే కొత్త నిబంధనలు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే ఈ నిబంధనలు అన్ని బ్యాంకర్లకు మాత్రం కాదండోయ్.. కేవలం బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు మాత్రమే ఈ కొత్త నిబంధనలు రాబోతున్నాయి.

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త రూల్స్ తీసుకువస్తుంది. చెక్ పేమెంట్లకు సంబంధించి పాజిటివే పే కన్ఫర్మేషన్ సిస్టమ్ అమలులోకి తీసుకురాబోతుంది. కస్టమర్లు మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. కస్టమర్లు మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. రూ. 2 లక్షలకు పైన విలువగల చెక్ లావాదేవీలకు కస్టమర్లు కచ్చితంగా మరోసారి రీకన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే పూర్తవుతుంది. అయితే బ్యాంక్ కస్టమర్లు ఎవరైనా చెక్ లావాదేవీలు నిర్వహిస్తే.. వారు చెక్ జారీ వివరాలకు బ్యాంకు ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో బ్యాంక్ ఆ చెక్‏ల ఆలస్యం లేకుండా క్లియర్ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తన వెబ్ సైట్ లో ఈ విషయాన్ని ప్రకటించింది. రూ. 50 వేలు లేదా ఆపైన విలువ గత చెక్స్ క్లియరెన్స్ కు కన్ఫర్మేషన్ కచ్చితంగా కావాలి. ఒక్కసారి వివరాలను ఎన్ పీసీఐ సర్వర్ కు అందించిన తర్వాత సవరణలు చేయడం, తొలగించడం వంటివి ఉండవు. కస్టమర్లు పంపించే వివరాలు, చెక్ వివరాలు మ్యాచ్ అయితేనే చెక్ క్లియర్ చేస్తారు.

Also Read: Billboard Music Awards: బిల్‏బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‏లో తళుక్కుమన్న ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్..

డాక్టర్లు దేవుళ్ళు కాదు.. వారిలో రాక్షసులు కూడా ఉన్నారు.. వారే నా తండ్రిని చంపేశారు.. ఎవరిని వదలను.. నటి ఆవేదన..