Bank of Baroda: భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ బ్యాంక్ ఆఫ్ బరోడా అదిరిపోయే డిపాజిట్ స్కీమ్ ను ప్రారంభించింది. ఈరోజే ప్రారంభమైన ఈపథకం డిసెంబర్ వరకు అందుబాటులో ఉండనుంది. తక్కువ సమయంలో అధిక వడ్డీ రేటు ఆశించే వారికి ఇదొక మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ‘బరోడా తిరంగా’ పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడిపాజిట్ స్కీమ్ ను ప్రారంభించింది. రెండు కాల వ్యవధులకు సంబంధించి ఈపథకాన్ని ఆఫర్ చేస్తోంది. 444 రోజుల కాల వ్యవధిపై ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే 5.75 % వార్షిక వడ్డీని అందిస్తుంది. అలాగే 555 రోజులకు సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్ ప్లాన్ లో 6% వడ్డీని అందిస్తుంది. ఆగష్టు 16వ తేదీన ప్రారంభమైన బరోడా తిరంగ పథకం డిసెంబర్ 31వ తేదీ వరకు అమలులో ఉండనుంది. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈపథకంలో డిపాజిట్ చేయ్యెచ్చు. అయితే సీనియర్ సిటిజన్ లు అయితే మరో 0.50% అదనపు వడ్డీ రేటును పొందుతారు. నిర్ణీత గడువు వరకు డిపాజిట్ ను ఉంచితే మరో 0.15% వడ్డీ రేటును అదనంగా పొందవచ్చు.
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ వినియోగదారుల కోసం ఈప్రత్యేకమైన పథకాన్ని తీసుకొచ్చినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. దేశంలోని అత్యంత విశ్వసనీయ బ్యాంకుల్లో ఒకటైన తమ బ్యాంకు రెండు కాల వ్యవధులతో కూడిన ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఇలా ఉండగా భారతీయ స్టేట్ బ్యాంకు కూడా ఉత్సవ్ పేరుతో ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..