Bank Of Baroda: సరికొత్త అకౌంట్‌ను ప్రారంభించిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా… ఫ్యామిలీ ప్యాకేజ్‌తో ప్రత్యేక ఆఫర్లు

తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా సేవింగ్స్, కరెంట్ ఖాతాల కోసం 'బీఓబీ పరివార్ అకౌంట్'ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ "బీఓబీ కే సంగ్ త్యోహార్ కి ఉమంగ్" పండుగ ప్రచారంలో భాగంగా ప్రారంచిన 'మై ఫ్యామిలీ, మై బ్యాంక్' సెగ్మెంట్ ఒకే కుటుంబంలోని సభ్యులకు చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను ఒకే కుటుంబం కింద సమూహపరుస్తుంది.

Bank Of Baroda: సరికొత్త అకౌంట్‌ను ప్రారంభించిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా… ఫ్యామిలీ ప్యాకేజ్‌తో ప్రత్యేక ఆఫర్లు
Bank Of Baroda

Edited By: Ravi Kiran

Updated on: Dec 06, 2023 | 9:35 PM

భారతదేశంలో బ్యాంకింగ్‌ రంగ సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెరిగిన టెక్నాలజీ కారణంగా కొత్త బ్యాంక్‌ అకౌంట్లు తీసుకోవడం అనేది చాలా ఈజీగా మారింది. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి అన్ని బ్యాంకులు సరికొత్త ఆఫర్లు ప్రవేశ పెడుతున్నారు. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా సేవింగ్స్, కరెంట్ ఖాతాల కోసం ‘బీఓబీ పరివార్ అకౌంట్’ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ “బీఓబీ కే సంగ్ త్యోహార్ కి ఉమంగ్” పండుగ ప్రచారంలో భాగంగా ప్రారంచిన ‘మై ఫ్యామిలీ, మై బ్యాంక్’ సెగ్మెంట్ ఒకే కుటుంబంలోని సభ్యులకు చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను ఒకే కుటుంబం కింద సమూహపరుస్తుంది. అయితే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తీసుకొచ్చిన ఈ కొత్త అకౌంట్‌ పాలసీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

బీఓబీ ప్రతి ఖాతా ప్రాథమిక ఖాతాదారుడిగా స్వతంత్రంగా నిర్వహిస్తుండగా, త్రైమాసిక సగటు బ్యాలెన్స్ (క్యూఏబీ) నిర్వహణ సమూహం/కుటుంబ స్థాయిలో నమోదు చేస్తారు. ప్రతి ఒక్క ఖాతాలో క్యూఏబీ నిర్వహించాల్సిన అవసరాన్ని తొలగిస్తుందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. బీఓబీ పరివార్ సదుపాయం నూతన, ఇప్పటికే ఉన్న వినియోగదారులకు తెరిచి ఉంటుంది. ఇది కనిష్టంగా ఇద్దరు, గరిష్టంగా ఆరుగురు సభ్యులతో కలిపి ఖాతాను నిర్వహించుకోవచ్చు. బీఓబీ పరివార్ సేవింగ్స్ ఖాతా విభాగానికి అర్హత కలిగిన కుటుంబ సభ్యులలో జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, కోడల లేదా అల్లుడు ఉన్నారు. బీఓబీ పరివార్ కరెంట్ ఖాతా సెగ్మెంట్ యాజమాన్యం, భాగస్వామ్యం, ఎల్‌ఎల్‌పీ, ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు, ఇవి గ్రూప్ కంపెనీలకు ఎలా సేవలు అందిస్తారో? అనే ఆందోళనలు నెలకొంటున్నాయి. 

బీఓబీ పరివార్‌ సేవింగ్స్‌ ఖాతా, బీఓబీ పరివార్‌ కరెంట్‌ ఖాతా విభాగాలు రెండూ మూడు విభిన్న వేరియంట్‌లలో వస్తాయి. డైమండ్, గోల్డ్, సిల్వర్ వేరియంట్స్‌లో ఉంటాయి. వివిధ పూల్డ్ క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ అవసరాలతో డైమండ్ రూ. లక్షలు మరియు అంతకంటే ఎక్కువ, గోల్డ్‌ రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువ, సిల్వర్‌ రూ.50,000, అంతకంటే ఎక్కువ లిమిట్‌గా ఉన్నాయి. అలాగే కరెంట్ ఖాతాలక డైమండ్‌రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ, గోల్డ్‌ రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ, సిల్వర్‌ రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువ సొమ్ముకు లిమిట్‌ ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి