Bank Licence Cancellation: ఈ ప్రధాన బ్యాంకుపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. లైసెన్స్‌ రద్దు.. ఎందుకంటే..

|

Nov 12, 2022 | 8:44 AM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోంది. రూల్స్‌..

Bank Licence Cancellation: ఈ ప్రధాన బ్యాంకుపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. లైసెన్స్‌ రద్దు.. ఎందుకంటే..
RBI
Follow us on

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోంది. రూల్స్‌ ఉల్లంఘించిన బ్యాంకుల లైసెన్స్‌లు రద్దు చేయడం, భారీ జరిమానా విధించడం వంటి చర్యలు దిగుతోంది. ఇక తాజాగా దేశంలో ఒక ప్రధాన బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని యవత్మాల్‌లోని బాబాజీ డేట్ మహిళా సహకారి బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. రుణదాతకు తగినంత మూలధనం, సంపాదన అవకాశాలు లేనందున ఈ చర్య తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

బ్యాంక్ విడుదల చేసిన డేటాను ఉటంకిస్తూ రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్లలో 79 శాతం మంది తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) నుండి పొందేందుకు అర్హులు. అక్టోబరు 16, 2022 వరకు మొత్తం హామీ మొత్తంలో డీఐసీజీసీ ఇప్పటికే రూ.294.64 కోట్లు చెల్లించింది.

లైసెన్స్ రద్దుకు కారణం ఏమిటి?

ఈ బ్యాంకు లైసెన్స్‌ని రద్దు చేసినందున బాబాజీ డేట్ మహిళా సహకరి బ్యాంక్ లిమిటెడ్, ఆర్బీఐ అందించిన సమాచారం ప్రకారం.. ఇతరత్రా డిపాజిట్లు తీసుకోవడం, చెల్లింపులు చేయడం వంటి ‘బ్యాంకింగ్’ వ్యాపారాన్ని కొనసాగించకుండా నిషేధించబడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి