Bank Holidays in May 2024: మే నెలలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు మూసి ఉంటాయో తెలుసా?

కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ ముగియబోతోంది. మే 2024 ప్రారంభం కానుంది. మీరు తదుపరి నెలలో బ్యాంక్‌కు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పనిని కలిగి ఉన్నట్లయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా బ్యాంక్ సెలవుల జాబితాను చూసిన తర్వాత అలర్ట్‌ కావడం ముఖ్యం. ఏదైనా బ్యాంకు పని ఉంటే సెలవులను పరిశీలించి ప్లాన్ చేసుకోవడం మంచిది. మే నెలలో మొత్తం..

Bank Holidays in May 2024: మే నెలలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు మూసి ఉంటాయో తెలుసా?
Bank
Follow us

|

Updated on: Apr 29, 2024 | 11:00 AM

కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ ముగియబోతోంది. మే 2024 ప్రారంభం కానుంది. మీరు తదుపరి నెలలో బ్యాంక్‌కు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పనిని కలిగి ఉన్నట్లయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా బ్యాంక్ సెలవుల జాబితాను చూసిన తర్వాత అలర్ట్‌ కావడం ముఖ్యం. ఏదైనా బ్యాంకు పని ఉంటే సెలవులను పరిశీలించి ప్లాన్ చేసుకోవడం మంచిది. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు అలాగే ఆదివారం సెలవులు ఉంటాయి.

బ్యాంకింగ్ హాలిడే ప్రకారం.. మీ బ్యాంక్ సంబంధిత పనిని ప్లాన్ చేసుకోవడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి నెలా ప్రారంభానికి ముందు ఆర్బీఐ తన వెబ్‌సైట్‌లో బ్యాంక్ సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది మే 2024 కోసం బ్యాంక్ సెలవుల జాబితా కూడా అప్‌లోడ్ చేసింది. మేలో వచ్చే ఈ సెలవుల్లో అక్షయ తృతీయ, మహారాష్ట్ర డే, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, ఇతర సెలవులు ఉన్నాయి.

మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

  1. మే 1: మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, అమరావతి, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పట్నా, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో బ్యాంకులు బంద్‌.
  2. మే 5: ఆదివారం.
  3. మే 8: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
  4. మే 10: బసవ జయంతి/ అక్షయ తృతీయ సందర్భంగా బ్యాంకులు బంద్‌.
  5. మే 11: రెండో శనివారం.
  6. మే 12: ఆదివారం.
  7. మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.
  8. మే 19: ఆదివారం.
  9. మే 20: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
  10. మే 23: బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇటానగర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
  11. మే 25: నాలుగో శనివారం. దేశంలోని అన్ని బ్యాంక్‌లలకు సెలవు.
  12. మే 26: ఆదివారం.

బ్యాంకు సెలవుల జాబితాను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయండి:

మీరు ఇంటి నుండి బ్యాంకుకు వెళ్లినట్లయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ సెలవుల జాబితాను చూసిన తర్వాత మాత్రమే బయలుదేరండి. సెంట్రల్ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో ప్రతి నెలా వచ్చే బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను, వాటి కారణాలను అలాగే ఈ సెలవులు పాటించాల్సిన నగరాలను అప్‌లోడ్ చేస్తుంది. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా దీన్ని చూడవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
పూరన్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన లక్నో.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
పూరన్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన లక్నో.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఆసీస్ బీచుల్లో రష్మిక ఫొటో షూట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
ఆసీస్ బీచుల్లో రష్మిక ఫొటో షూట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
రసాయనాలు లేకుండా రెండ్రోజుల్లోనే పచ్చి అరటిగెల పండింది..?!ఎలాగంటే
రసాయనాలు లేకుండా రెండ్రోజుల్లోనే పచ్చి అరటిగెల పండింది..?!ఎలాగంటే
బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. ఊహించని పాత్రలో అనన్య..
బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. ఊహించని పాత్రలో అనన్య..
ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్..
ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్..
లక్నో ఓనర్ ఇంట్లో కేఎల్ రాహుల్‌ డిన్నర్.. అతియా శెట్టి ఏమందంటే?
లక్నో ఓనర్ ఇంట్లో కేఎల్ రాహుల్‌ డిన్నర్.. అతియా శెట్టి ఏమందంటే?
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..?లాభాలు తెలిస్తేఆశ్చర్యపోతారు
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..?లాభాలు తెలిస్తేఆశ్చర్యపోతారు