కొత్త సంవత్సరం వచ్చేసింది. అలాగే కొత్త నెల కూడా ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి పలు అంశాలలో మార్పులు రానున్నాయి. వీటితోపాటు బ్యాంకు సెలవులు కూడా ముందుగానే తెలుసుకుంటే మంచిది. బ్యాంకులో అత్యంత ముఖ్యమైన పని ఉండి వెళ్లాల్సి రావొచ్చు. దీంతో బ్యాంకులు ఎప్పుడెప్పుడు పనిచేయవో తెలుసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. ఈనెలలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు దాదాపు 16 రోజులు బంద్ కానున్నాయి. రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ హాలిడేస్ క్యాలెండర్ విడుదల చేసింది. అయితే బ్యాంకుల హాలిడేస్ రాష్టాల వారిగా కేటాయించబడతాయి. దీంతో రాష్ట్రాల వారిగా బ్యాంకుల సెలవులు మారుతుంటాయి. మరీ ఈనెలలో ఎప్పుడెప్పుడు బ్యాంకులు మూతపడనున్నాయో తెలుసుకుందామా.
సాధారణంగా మనకు మూడు జాతీయ సెలవులు ఉన్నాయి. అవి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి. అలాగే జనవరిలో మొత్తం 16 హాలీడేస్ ఉండగా.. 7 వీకెండ్ హాలీడేస్ ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి.
జనవరి 1: కొత్త సంవత్సరం రోజు
జనవరి 2: వీక్లీ ఆఫ్ (ఆదివారం)
జనవరి 4: లోసూంగ్ (గ్యాంగ్ టక్)
జనవరి 8: రెండవ శనివారం
జనవరి 9: ఆదివారం
జనవరి 11: మిషనరీ డే
జనవరి 12: స్వామి వివేకానంద జయంతి
జనవరి 14: మకర సంక్రాంతి, పొంగల్
జనవరి 15: సంక్రాంతి
జనవరి 16: ఆదివారం
జనవరి 18: థాయ్ పోసమ్
జనవరి 22: నాల్గవ శనివారం
జనవరి 23: ఆదివారం
జనవరి 26: గణతంత్ర దినోత్సవం
జనవరి 30: ఆదివారం
జనవరి 31: మి డామ్ మిఫై (అస్సాం)
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బ్యాంకులు నాలుగు రోజులు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. జనవరి 1న న్యూఇయర్.. అలాగే మకర సంక్రాంతి, సంక్రాంతి పురస్కరించుకుని జనవరి 14, 15న బ్యాంకులు పనిచేయవు. ఇక రిపబ్లిక్ డే జనవరి 26న బ్యాంకులు బంద్ ఉంటాయి. మొత్తంగా ఈనెలలో 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.
Also Read: Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..