Two Days Weekly Off: ఇకపై బ్యాంకులన్నీ వారానికి 5 రోజులే పనిచేస్తాయ్‌.. ఎందుకో తెలుసా..

|

Mar 02, 2023 | 12:05 PM

బ్యాంకు ఉద్యోగులకు త్వరలో వారానికి ఐదు రోజులు మాత్రమే పని రోజులు కానున్నాయి. అంటే బ్యాంకులు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తాయన్న మాట. ఇందుకు సంబంధించి..

Two Days Weekly Off: ఇకపై బ్యాంకులన్నీ వారానికి 5 రోజులే పనిచేస్తాయ్‌.. ఎందుకో తెలుసా..
Two Days Weekly Off
Follow us on

బ్యాంకు ఉద్యోగులకు త్వరలో వారానికి ఐదు రోజులు మాత్రమే పని రోజులు కానున్నాయి. అంటే బ్యాంకులు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తాయన్న మాట. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా గత కొంతకాలంగా బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు చేస్తున్న విజ్ఞప్తులపై ఐబీఎమ్‌ స్పందించనుంది. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. దీని అమలుపై నిర్ణయం వెలువడింతే.. వారంలో 5 రోజుల పని దినాలో ఉద్యోగులు ప్రతిరోజూ అదనంగా 50 నిమిషాలు పనిచేయవల్సి ఉంటుంది. దీనిపై ప్రస్తుతం ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (UFBEs) మధ్య చర్చలు జరుగుతున్నాయి. వారంలో 5 రోజుల పని ప్రపోజల్‌కు అసోసియేషన్‌ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.

గోషియబుల్ ఇన్‌స్ట్రమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 25 ప్రకారం అన్ని శనివారాలను ప్రభుత్వం సెలవులుగా ప్రకటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు నెలకు రెండు శనివారాల్లో (వారం విడిచా వారం) పని చేస్తున్నారు. ఉద్యోగులు ప్రతిరోజూ ఉదయం 9 గంటల 45 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిముషాల వరకు అదనంగా 40 నిమిషాలు పని చేయాల్సి ఉంటుందని ఆల్‌ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.నాగరాజన్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.