Bank Holidays: బక్రీద్ హాలీడే.. ఏపీ, తెలంగాణలో బ్యాంకులకు సెలవు ఎప్పుడంటే..?

బక్రీద్ సందర్భంగా బ్యాంక్ సెలవులపై కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే సెలవులు రాష్ట్రాల వారీగా మారాయి. కొన్ని రాష్ట్రాలు మే 27న సెలవు ప్రకటించగా.. ఇతర రాష్ట్రాల్లో మే 28న అధికారిక సెలవు ప్రకటించారు. దీంతో బ్యాంక్ సెలవుల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.

Bank Holidays: బక్రీద్ హాలీడే.. ఏపీ, తెలంగాణలో బ్యాంకులకు సెలవు ఎప్పుడంటే..?
Banks Holiday

Updated on: May 28, 2026 | 11:18 AM

బక్రీద్ తేదీపై గందరగోళం నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో మే 27వ తేదీన జరుపుకోగా.. మరికొన్ని రాష్ట్రాల్లో మే 28వ తేదీన జరుపుకుంటున్నారు. దీంతో కొన్ని స్టేట్స్‌లో బ్యాంకులు మే 27న మూతపడగా.. మరికొన్ని రాష్ట్రాల్లో 28న బంద్ చేశారు. ఢిల్లీతో పాటు తెలంగాణ ప్రభుత్వం బక్రీద్ సెలవును మే 27 నుండి మే 28కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులు ఏ రోజు మూసి ఉంటాయనేది రాష్ట్రాల వారీగా మారింది. వినియోగదారులు బ్రాంచ్‌ను సందర్శించడానికి ముందు తమ తమ రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోండి.

మే 27న ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు

త్రిపుర, గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, జమ్మూ, కేరళ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూతపడ్డాయి.

మే 28న ఈ రాష్ట్రాల్లో..

మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, జమ్మూ, శ్రీనగర్, గోవా, మేఘాలయ, బీహార్, ఏపీ రాష్ట్రాలలో బ్యాంకులు మూసివేయబడతాయి.

అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఎందుకు లేదు..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బక్రీద్ సందర్భంగా బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. అయితే బక్రీద్ సెలవు అనేది కచ్చితమైన తేదీ, చంద్ర దర్శనంపై ఆధారపడి ఉంటుంది. పండుగ మొదటి రోజున లేదా రెండవ రోజున మూసివేతను పాటిస్తారా అనేది నిర్ధారించడానికి రాష్ట్రాల వారీగా సెలవుల జాబితాను సవరిస్తారు. దీంతో బక్రీద్ సెలవుపై గందరగోళం నెలకొంది.

Follow Us