NetBanking: నెట్‌బ్యాంకింగ్‌ చెల్లింపులపై ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. కస్టమర్‌ పేరు, పాస్‌వర్డ్‌ అవసరం లేకుండానే లావాదేవీలు!

|

Jan 12, 2022 | 2:11 PM

NetBanking: దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్‌ను సురక్షితమైన, వేగవంతమైనదిగా..

NetBanking: నెట్‌బ్యాంకింగ్‌ చెల్లింపులపై ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. కస్టమర్‌ పేరు, పాస్‌వర్డ్‌ అవసరం లేకుండానే లావాదేవీలు!
Follow us on

NetBanking: దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్‌ను సురక్షితమైన, వేగవంతమైనదిగా మార్చడానికి కొత్త అడుగు వేసింది. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ల బయోమెట్రిక్ ప్రమాణీకరణ వేలిముద్ర లేదా ఫేస్ ID ప్రమాణీకరణతో చేసేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టింది. నెట్ బ్యాంకింగ్ చెల్లింపు కోసం వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, ఓటీపీ (OTP) అవసరం లేదు. బ్యాంక్ తన కస్టమర్‌లకు బయోమెట్రిక్ ప్రమాణీకరణ పరిష్కారాన్ని అందించడానికి MinkasuPayతో జతకట్టింది. దీంతో నెట్ బ్యాంకింగ్ చెల్లింపులు పూర్తయ్యే సమయం ప్రస్తుతం 50-60 సెకన్ల నుంచి 2-3 సెకన్లకు తగ్గుతుంది. లావాదేవీ విజయవంతమైన రేటింగ్‌ కూడా పెరుగుతుంది.

కస్టమర్ల బయోమెట్రిక్ లేదా ఫేస్ ఐడితో లాగిన్‌ అయి లావాదేవీలను జరుపుకోవచ్చని సదరు బ్యాంకు వెల్లడించింది. Minkasupayతో యాక్సిస్ బ్యాంక్ ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ మరియు OTP లేకుండా వేలిముద్ర లేదా ఫేస్ IDని ఉపయోగించి యాప్‌లో నెట్ బ్యాంకింగ్ చెల్లింపులను చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

సైబర్ మోసాలు తగ్గుతాయి:
కాగా, ది హిందూ బిజినెస్‌లైన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. యాక్సిస్ బ్యాంక్, మింకాసుపే సంయుక్త ప్రకటనలో ఇది భద్రతను మెరుగుపరచడానికి, అలాగే సైబర్ మోసాలను తగ్గించడానికి, వినియోగదారునికి మెరుగైన సేవలు అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని బ్యాంకు తెలిపింది.

సురక్షిత లావాదేవీ
మొదటి లావాదేవీ కోసం, కస్టమర్‌లు వారి వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. OTP ఆన్-బోర్డ్‌లో ఉండాలంటే యధావిధిగా ధృవీకరించబడాలి. అన్ని తదుపరి లావాదేవీల కోసం, చెల్లింపులను ఆమోదించడానికి వేలిముద్ర లేదా ఫేస్ ID ఉపయోగించవచ్చు. ఇలా రెండు రకాల లాగిన్‌ అయి లావాదేవీలను చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Credit Card: మీరు ఆ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఇక నుంచి బాదుడే బాదుడు..

Maruti Suzuki Cars: కారు కొనుగోలు చేసేవారికి మారుతి సుజుకీ బంపర్‌ ఆఫర్‌.. ఈ కార్లపై రూ.33,000 వరకు డిస్కౌంట్‌