FD Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు.. ఈ మూడు బ్యాంకుల్లోనే టాప్‌ వడ్డీ రేట్లు

|

Sep 17, 2023 | 2:22 AM

పెరిగిన టెక్నాలజీ కారణంగా ఆన్‌లైన్‌ ఫ్రాడ్స్‌ కూడా విపరీతంగా పెరిగాయి. బ్యాంకుల్లో డబ్బుకు గ్యారెంటీ లేకపోవడంతో ఎంతో కొంత వడ్డీ వస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా గత రెండేళ్ల ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు గణనీయంగా పెంచాయి. మే 2022 నుంచి ఆర్‌బీఐ  పాలసీ రేట్లను నిరంతరం పెంచిన తర్వాత ఎఫ్‌డీతో సహా రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ పెంపుదల తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా అధిక వడ్డీ రేట్లను అందిస్తూ ఆకర్షణీయంగా మారాయి.

FD Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు.. ఈ మూడు బ్యాంకుల్లోనే టాప్‌ వడ్డీ రేట్లు
Fixed Deposit
Follow us on

ప్రస్తుత రోజుల్లో సంపాదించిన సొమ్ముకు భద్రత లేకుండా పోయింది. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం లిక్విడ్‌ క్యాష్‌పై పరిమితులు విధించింది. ఈ నేపథ్యంలో డబ్బును కచ్చితంగా అకౌంట్స్‌లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా ఆన్‌లైన్‌ ఫ్రాడ్స్‌ కూడా విపరీతంగా పెరిగాయి. బ్యాంకుల్లో డబ్బుకు గ్యారెంటీ లేకపోవడంతో ఎంతో కొంత వడ్డీ వస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా గత రెండేళ్ల ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు గణనీయంగా పెంచాయి. మే 2022 నుంచి ఆర్‌బీఐ  పాలసీ రేట్లను నిరంతరం పెంచిన తర్వాత ఎఫ్‌డీతో సహా రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ పెంపుదల తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా అధిక వడ్డీ రేట్లను అందిస్తూ ఆకర్షణీయంగా మారాయి. మూడు ప్రధాన బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ డిపాజిట్ కాలపరిమితి, డిపాజిటర్ వయస్సు ఆధారంగా ఎఫ్‌డీపై 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. పీఎన్‌బీ ఏటా 7.75 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. ఎస్‌బీఐ సంవత్సరానికి 7.50 శాతం వరకు ఇస్తుంది. కాబట్టి ఎఫ్‌డీలపై ఆయా బ్యాంకులు ఎంత మేర వడ్డీ ఇస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

ఎస్‌బీఐ వడ్డీ రేట్లు ఇలా

  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 46 రోజుల నుంచి  179 రోజులు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 180 రోజుల నుండి 210 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.75 శాతం
  • 211 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
  • 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
  • ఐదు సంవత్సరాల నుంచి  10 సంవత్సరాల వరకు ఉన్న సమయానికి సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం వడ్డీ అందిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

  • 7 రోజుల నుండి 29 రోజుల వరకూ సాధారణ ప్రజలకు – 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 30 రోజుల నుండి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుండి ఆరు నెలల కంటే తక్కువ రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం 
  • 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 9 నెలల 1 రోజు నుండి 1 సంవత్సరం కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 1 సంవత్సరం నుండి 15 నెలల కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.60 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.10 శాతం
  • 15 నెలల నుంచి  ఐదేళ్ల వరకూ  సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం 
  • ఐదు సంవత్సరాల 1 రోజు నుంచి  10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతంగా వడ్డీ అందిస్తున్నారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

  • ఏడు  రోజుల నుండి 179 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 90 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 180 రోజుల నుండి 270 రోజుల వరకూ సాధారణ ప్రజలకు – 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.00 శాతం
  • 271 రోజుల నుంచి  1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 5.80 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.30 శాతం
  • 1 సంవత్సరం నుంచి 443 పైన జనరల్ పబ్లిక్ కోసం – 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
  • 444 రోజులు నుంచి సాధారణ ప్రజలకు – 7.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం
  • 445 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
  • రెండు సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
  • ఐదు సంవత్సరాల నుంచి  10 సంవత్సరాలకు పైబడి రోజులకు సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..