- Telugu News Photo Gallery Technology photos EV scooters that have flooded the Indian market... These are the scooters that are attracting with features
EV Vehicles: భారత మార్కెట్‌ను ముంచెత్తిన ఈవీ స్కూటర్లు… కిర్రాక్ ఫీచర్స్‌తో ఆకర్షిస్తున్న స్కూటర్లు ఇవే..!
ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అమెరికా, చైనా తర్వాత ఈవీ మార్కెట్‌లో భారత్ అగ్రగామిగా ఉంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈవీల కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా గతేడాదిగా మార్కెట్‌లో రిలీజయ్యి ఎక్కువగా ఆకర్షించిన ఈవీల గురించి ఓ సారి తెలుసుకుందాం.
Srinu |
Updated on: Sep 09, 2023 | 9:30 PM

అథెర్ కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన 450 ఎక్స్‌ను అప్‌డేట్ చేస్తూ న్యూ వెర్షన్‌ను ఈ ఏడాదే ప్రకటించింది. అలాగే కొన్నిస్పెసిఫికేషన్లను తగ్గించి 450 ప్లస్‌ను కూడా లాంచ్ చేశారు. కాబట్టి ఈ స్కూటర్లు ఇప్పుడు రెండు వేరువేరు ధరల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఇప్పటికే ఈ కంపెనీ రిలీజ్ చేసిన 450 ఎస్‌పై కూడా వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో లూనా అనేది ఓ ట్రెండ్. ప్రారంభంలో ఈ స్కూటర్ ఎక్కువ ప్రజాదరణ పొందింది. అయితే లూనాకు కొనసాగింపుగా ప్రస్తుతం ఈవీ వెర్షన్‌లో లూనా తిరిగి మార్కెట్‌లోకి రానుది. కైనెటిక్ గ్రీన్ లూనా సెప్టెంబర్ చివరి నాటికి మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ స్కూటర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫొటోలు వైరలయ్యాయి.

భారత ఈవీ మార్కెట్‌లో రారాజుగా ఉన్న ఓలా కంపెనీ ఈ ఏడాది మరో రెండు స్కూటర్లను రిలీజ్ చేస్తన్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఎస్1 ప్రో జెన్ 2తో పాటు ఎస్1 ఎక్స్ పేరుతో రెండు స్కూటర్లను ఈ ఏడాది లాంచ్ చేసింది. త్వరలో ఈ రెండు స్కూటర్లు భారత మార్కెట్‌లో తమ హవా చూపనున్నాయి.

సింపుల్ ఎనర్జీ అనే కంపెనీ కూడా వన్ పేరుతో ఓ సరికొత్త ఈవీ స్కూటర్‌ను రిలీజ్ చేసింది. లుక్‌తో పాటు డిజైన్‌పరంగా ఈ స్కూటర్ ఈవీ ప్రియులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా స్పోర్టీ స్టైలింగ్‌తో వచ్చే ఈ స్కూటర్ ఈ ఏడాది చివరి నుంచి వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

టీవీఎస్ ఐక్యూబ్ దాని టాప్ ఎండ్ ఎస్‌టీను కూడా ప్రకటించారు. అయితే ఎన్నో ఎదురుచూపుల తర్వాత ఎస్టీ మోడల్ క్రేజీ అప్‌డేట్‌ను కంపెనీ ఇచ్చింది. ఈ స్కూటర్ ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ దీన్ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.





























